Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harsha Bhogle:పాక్ నెటిజన్ గూబ గుయ్ మనేలా కౌంటర్!

టీమిండియా ఆట తీరును చులకన చేస్తూ ఓ పాకిస్థాన్ అభిమాని చేసిన ట్వీట్‌కు ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కకుండా నోరు మూయించాడు. ఇలాంటి వంకర బుద్దిని వదిలి విశాల హృదయంతో ప్రపంచాన్ని చూస్తే. అద్భుతంగా కనిపిస్తోందంటూ కౌంటర్ ఇచ్చాడు.

మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో పింక్ బాల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత బ్యాటర్లంతా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌కు చెందిన షారూఖ్ ఖాన్ అనే ట్విటర్ యూజర్ ఎక్స్ వేదికగా షేర్ చేశాడు.

Harsha Bhogles Epic Response On Pakistan Fan for mocking Indias 36 all out disaster

'మీకు ఏ రోజైనా చెత్తగా అనిపిస్తే.. ఆసీస్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిన ఈ వీడియోనూ చూడండి'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌తో తీవ్ర ఆగ్రహానికి గురైన హర్షా భోగ్లే తెలివిగా సమాధానమిచ్చాడు.

'షారూఖ్ నువ్ ఈ వీడియోను బయటకు తీసినందుకు ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతో పట్టుదలగా.. అద్భుతంగా పోరాడి.. టెస్టు చరిత్రలోనే భారత జట్టు అదిరే ప్రదర్శన చేసింది దీని తర్వాతే. ఈ ఓటమి తర్వాతే భారత సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. అద్భుతమైన నాయకత్వ ప్రతిభ.. పట్టుదల, కసి ఉంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలం అనే నమ్మకం కలిగింది. ఈ ఇన్నింగ్స్ తర్వాతే. ఇలాంటి విషయాలను గుర్తు చేసుకున్నప్పుడే సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది'అని హర్షా భోగ్లే దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు.

మరో ట్వీట్‌లో 'ఇతరుల కష్టాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావంటే.. ఇంతకంటే వంకరబుద్ది మరొకటి ఉండదు. కాస్త పరణితితో, క్లాస్‌గా ఆలోచించి చూడు.. ప్రపంచం నీకు అద్భుతంగా కనిపిస్తుంది'అని చురకలు అంటించాడు.

Story first published: Thursday, December 7, 2023, 22:56 [IST]
Other articles published on Dec 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+