15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీనా.. బుద్దుండాలి: హర్షా భోగ్లే
టీమిండియా టేనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఈస్ట్‌జోన్ వైస్ కెప్టెన్‌గా నియమించడాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తప్పుబట్టాడు. బ్యాటింగ్‌లో వైభవ్ ప్రతిభ అసాధారణమని, కానీ అతన్ని వైస్ కెప్టెన్సీ చేయడం సరికాదన్నాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఈస్ట్ జోన్ జట్టులో వైస్ కెప్టెన్సీ బాధ్యతలను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారత సెలెక్టర్లు అప్పగించారు. ఈస్టో జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా వైభవ్ సూర్యవంశీ వ్యవహరించనున్నాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు.

హర్షా భోగ్లే కూడా సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, వైస్ కెప్టెన్సీ అప్పగించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. 'రెడ్ బాల్ క్రికెట్‌లో.. సీనియర్ ఆటగాళ్లు ఉండే జట్టుకు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.
అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. 17.25 సగటుతో 207 పరుగులు చేశాడు. నేను అతని ప్రతిభను తక్కువ చేయడం లేదు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్లేయర్. కానీ అతను నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.'అని హర్షా భోగ్లే సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈస్ట్ జోన్ జట్టులో మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్ వంటి సీనియర్ ఆటగాళ్లున్నారు. వారిని కాదని వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం సరికాదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
2026 దులీప్ ట్రోఫీకి ఈస్ట్ జోన్ జట్టు
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామీ, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుశాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రాంశు సేనాపతి, డానిష్ దాస్, అభిజిత్ సర్కార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

