
ఇషాన్ కిషన్‌కు భారీ ధర..
వేలంలో అత్యధిక ధర పలికే ఇద్దరు భారత ఆటగాళ్లను అంచనా వేసాడు. టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో పాటు దేశవాళీ హిట్టర్, తమిళనాడు ప్లేయర్ షారుఖ్ ఖాన్ జాక్‌పాట్ ధర పలుకుతాడని అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన హర్షా భోగ్లే.. ఇషాన్ కిషన్‌కు మంచి డిమాండ్ ఉందని తెలిపాడు. ‘వేలంలో ఇషాన్ కిషన్ హాట్ కేక్.
అతనికి ఫుల్ డిమాండ్ ఉంది. భారత ఆటగాడు కావడం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ అంతేకాకుండా లెఫ్టాండ్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ కావడంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. అతనికి అత్యధిక ధర దక్కే అవకాశం ఉంది'అని హర్షాభోగ్లే చెప్పుకొచ్చాడు.

యూసఫ్ పఠాన్‌లా షారుఖ్..
ఇక తమిళనాడు క్రికెటర్ షారుఖ్ ఖాన్.. ఫామ్‌లో ఉన్న మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను తలపిస్తాడని, సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే కేపాసిటీ అతని సొంతమని తెలిపాడు. ఫినిషింగ్ రోల్‌లో అతన్ని తీసుకునేందుకు జట్లు ఎగబడతాయని పేర్కొన్నాడు. ‘నా అంచనా ప్రకారం షారుఖ్ ఖాన్ భారీ ధర పలుకుతాడు. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌కు కావాల్సిన హిట్టింగ్ సామర్థ్యం అతనికి ఉంది. ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్ మాదిరి అతను చెలరేగగలడు. అతనిలానే సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం షారూఖ్‌కు ఉంది'అని హర్షా భోగ్లే తెలిపాడు.

రూ.17 కోట్లు పలికే చాన్స్..
గత సీజన్ వరకు ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్‌కు ఆడగా.. రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో ఆ జట్టు అతన్ని వేలంలోకి వదిలేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న ఇషాన్ కిషన్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. వికెట్ కీపర్లు ఉన్న చెన్నై, లక్నో, ఢిల్లీ మినహా అన్ని జట్లు అతని కోసం ప్రయత్నించనున్నాయి. టీమ్ భవిష్యత్తు దృష్ట్యా అతను కెప్టెన్సీకి కూడా పనికొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇషాన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ఈ క్రమంలోనే అతను రూ.10 కోట్ల నుంచి రూ.17 కోట్లు పలికే చాన్స్ ఉంది.

షారూఖ్‌కు రూ. 13 కోట్లు..
గత సీజన్‌లో రూ. 5.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ తీసుకోగా.. 11 మ్యాచ్‌లు ఆడిన అతను 21.85 యావరేజ్‌తో 153 పరుగులు చేశాడు. ఆ జట్టు తరఫున సరైన అవకాశాలు అతనికి రాలేదు. ఇక ఫ్రాంచైజీ మారాలనే ఉద్దేశంతో పంజాబ్ కింగ్స్ రిటెన్షన్‌కు ఒప్పుకోని షారూఖ్ ఖాన్ వేలానికి అందుబాటులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో మరోసారి సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించిన షారూఖ్ భారీ ధర పలికే చాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీలన్నీ ఈ తమిళనాడు క్రికెటర్ కోసం పోటీపడనున్నాయి. అతను ఈసారి రూ. 10-రూ.13 కోట్లు పలికే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications
