ఆసియా కప్ 2025 రైజింగ్ టోర్నీలో భారత్-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన జితేశ్ శర్మ సారథ్యంలోని భారత్-ఏ 6 వికెట్ల తేడాతో ఒమన్‌ను ఓడించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ హర్ష్ దూబే (44 బంతుల్లో 53 నాటౌట్, 1/30) అసాధారణ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. వసీమ్ అలీ(45 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. హమ్మద్ మిర్జా(16 బంతుల్లో 32) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో గుర్జప్‌నీత్ సింగ్(2/37), సుయాష్ శర్మ(2/12) రెండేసి వికెట్లు తీయగా.. విజయ్‌కుమార్ వైశాఖ్(1/34), హర్ష్ దూబే(1/30), నమన్ ధీర్(1/5) తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్-ఏ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 138 పరుగులు చేసి గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ(12), ప్రియాన్ష్ ఆర్య(10) విఫలమైనా.. నమన్ ధీర్(30), హర్ష్ దూబే(53 నాటౌట్) జట్టును గెలిపించారు. నెహాల్ వధేరా(23) పర్వాలేదనిపించాడు. ఒమన్ బౌలర్లలో జయ్ ఒడెడ్రా, షఫీక్ జాన్, సమయ్ శ్రీవాత్సవ, ఆర్యన్ బిష్త్ తలో వికెట్ తీసారు.
పాకిస్థాన్‌తో గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి భారత్-ఏ జట్టు త్వరగానే తేరుకుంది. హర్ష్ దూబే తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లెఫ్టార్మ్ పేస్ ఆల్‌రౌండర్ అయిన హర్ష్ దూబే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీసాడు. రూ.30 లక్షల కనీస ధరతో ఉన్న అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.
శుక్రవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో గ్రూప్-బీ రన్నరప్ అయిన భారత్-ఏ.. గ్రూప్-ఏ టాపర్‌తో ఆడనుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ గ్రూప్-ఏ టాపర్‌గా కొనసాగుతోంది. శ్రీలంక-ఏతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌తో బంగ్లాదేశ్ సెమీఫైనల్ ఆడుతోంది. భారీ తేడాతో ఓడితే మాత్రం శ్రీలంకతో భారత్ సెమీఫైనల్లో తలపడుతోంది.