అశ్విన్ తయారు చేసిన జడేజా 2.O.. హర్ష్‌దూబే వెనుక పుట్టెడు దు:ఖం!
విమాన ఆలస్యం ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే జీవితాన్ని మే 19న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక గంట ఫ్లైట్ ఆలస్యం పూర్తిగా మార్చేసింది. టీమ్‌మేట్స్‌తో కలిసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమవుతుండగా దూబేకు ఒక అపరిచిత నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
'భారత జట్టుకు ఎంపికవ్వడం ఎలా అనిపిస్తోంది?'అని అవతలి వ్యక్తి అడిగారు. శ్రీలంక టూర్‌కు వెళ్లే 'ఇండియా-ఎ' జట్టు గురించే ఆ కాల్ అనుకుని దూబే సాధారణంగానే సమాధానం ఇచ్చాడు. కానీ, ఆ కొద్దిసేపటికే ఒక సీనియర్ జర్నలిస్ట్ పంపిన మెసేజ్‌తో అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్, వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాననే విషయం తెలిసి దూబే షాక్‌కు గురయ్యాడు.
పక్కనే కూర్చున్న ఇషాన్ కిషన్‌కు కూడా అప్పటివరకు ఈ విషయం తెలియదు. ఒకవేళ ఫ్లైట్ ఆలస్యం కాకపోయి ఉంటే.. ఈ విషయం ల్యాండ్ అయిన తర్వాతే తెలిసేది. ఈ వార్త వినగానే నాగ్‌పూర్‌లోని అతని తండ్రి ఆనందంతో ఫోన్లోనే ఏడ్చేశారు.

అశ్విన్ తయారు చేసిన జడేజా 2.O
హర్ష్ దూబే ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఒకానొక సమయంలో విదర్భ రంజీ టీమ్ నుంచి అతను వేటుకు గురయ్యాడు. దాంతో మరింత కసిగా ఆడిన అతను అండర్ 23 మ్యాచ్‌లో 7 వికెట్ల తీసాడు. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ రజనీష్ గుర్బానీ ఒక చెస్ గేమ్ ఆడుతూ రవిచంద్రన్ అశ్విన్‌కు దూబే గురించి చెప్పాడు.
దూబే బౌలింగ్ వీడియోలు చూసి ఇంప్రెస్ అయిన అశ్విన్.. అతన్ని చెన్నై లీగ్ క్రికెట్ (MRCA) ఆడేందుకు ఆహ్వానించాడు. అక్కడ క్రీజ్‌ను ఎలా వాడాలో.. పేస్‌ను ఎలా నియంత్రించాలో నేర్పించాడు. అశ్విన్ ట్రైనింగ్ దూబే కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 2024-25 రంజీ ట్రోఫీలో ఏకంగా 69 వికెట్లు, 469 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అలాగే 2025లో విదర్భకు విజయ్ హజారే ట్రోఫీని అందించాడు.
జడేజా చిట్కాలతో..
దేశవాళీ క్రికెట్‌లో దూబేను రవీంద్ర జడేజా 2.0గా పిలుస్తారు. చిన్నప్పటి నుంచి జడేజాను చూస్తూ పెరిగిన దూబేకు, ఐపీఎల్ సమయంలో జడేజా స్వయంగా కలిసి మైండ్‌సెట్ గురించి చిట్కాలు ఇచ్చాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం దూబేను 'నెక్స్ట్ జనరేషన్ ఆల్-ఫార్మాట్ ఆల్‌రౌండర్' అని కొనియాడాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో పనిచేయడం, రోహిత్ శర్మతో పాటు తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో వికెట్ అయిన విరాట్ కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఒక కల నిజమవ్వడం లాంటిదని దూబే సంతోషం వ్యక్తం చేశాడు. జూన్ 1న చండీగఢ్‌లో భారత జట్టు క్యాంప్ ప్రారంభమైంది. కొడుకు క్రికెట్ కెరీర్ కోసం హర్షద్ దూబే తండ్రి తన సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేయగా.. ఇప్పుడు హర్ష్ దూబే టీం ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

