Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీర కొంగు షాట్.. పోలా అదిరిపోలా!(వీడియో)

ది హండ్రెడ్ 2025 పురుషుల టోర్నీలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కళ్లు చెదిరే సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. తనకే సాధ్యమైన దిల్‌ స్కూప్ షాట్‌తో ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ ఈ షాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దాంతో ఈ షాట్‌కు అతని పేరు వచ్చేలా దిల్‌ స్కూప్ షాట్ అని నామకరణం చేశారు.

కాళ్లు మడత పెట్టి బ్యాట్ ముందుకు పెట్టి వెనక్కి ఆడే ఈ షాట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో దిల్షాన్ ఈ షాట్స్ ఎక్కువగా ఆడేవాడు. అతని రిటైర్మెంట్ తర్వాత.. ఈ షాట్‌ ఎక్కువగా కనిపించలేదు. స్వీప్, రివర్స్ స్వీప్, రివర్స్ స్కూప్ షాట్స్ ప్రాచూర్యంలో వచ్చాయి. కానీ హండ్రెడ్ లీగ్‌లో హ్యారీ బ్రూక్ పర్‌ఫెక్ట్‌గా దిల్ స్కూప్ షాట్ ఆడి అభిమానులను అలరించాడు.

Harry Brook s Daring Dil-Scoop Six on First Ball Goes Viral in The Hundred
Photo Credit: X (twitter)

చీర కొంగు షాట్..

చీర కొంగు కప్పుకునేలా ఉండే ఈ షాట్‌కు క్రికెట్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ 2025 పురుషుల టోర్నీలో హ్యారీ బ్రూక్ సన్‌రైజర్స్ గ్రూప్‌కు చెందిన నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ ఈ దిల్ స్కూప్ షాట్ ఆడాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. టీమ్ సౌథీ వేసిన 74వ బంతిని దిల్‌స్కూప్ షాట్ ద్వారా సిక్సర్‌‌ రాబట్టాడు. ఈ షాట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'చీర కొంగు షాట్.. పోలా అదిరిపోలా'అని కామెంట్ చేస్తున్నారు. 'తొలి బంతికే రిస్కీ షాట్.. ఏం గుండెరా అది'అని కొనియాడుతున్నారు.

ఈ టోర్నీలో నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ దుమ్మురేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన నార్నర్న్ సూపర్ ఛార్జర్స్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది.

మలాన్, బ్రూక్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో5 వికెట్లకు 193 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించగా..జాక్ క్రాలీ(23 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), కెప్టెన్ హ్యారీ బ్రూక్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఫోనిక్స్ బౌలర్లలో క్రిస్ వుడ్(2/34) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.

మలుపు తిప్పిన రషీద్..

అనంతరం బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ నిర్ణీత 10 బంతుల్లో 9 వికెట్లకు 157 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ లియామ్ లివింగ్ స్టోన్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 46), జాకోబ్ బెతెల్(31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) రాణించినా ఫలితం లేకపోయింది. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో మాథ్యూ పోట్స్(3/26) మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డప్ఫీ, ఆదిల్ రషీద్, టామ్ లాస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కీలక వికెట్లు తీసి మ్యాచ్‌‌ను మలుపు తిప్పిన ఆదిల్ రషీద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Story first published: Saturday, August 16, 2025, 11:59 [IST]
Other articles published on Aug 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+