Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని క్యాచ్.. బిత్తరపోయిన బెయిర్ స్టో (వీడియో)

లండన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్, ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో బంతిని అందుకొని ఔరా అనిపించాడు. ది హండ్రెడ్ టోర్నీలో నార్తెర్న్ సూపర్‌ చార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యారీ బ్రూక్.. వెల్ష్ ఫైర్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

అతని అసాధారణ క్యాచ్‌కు ఫైర్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో(44) బిత్తరపోయాడు. ఇలా కూడా క్యాచ్ పడుతారా? అని సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ ఒంటి కాలితో బంతిని అందుకున్నాడు. కానీ సమన్వయం కోల్పోయిన అతను చాకచక్యంగా బంతిని గాల్లోకి వేసి అందుకున్నాడు.

Harry Brook Catch

మళ్లీ బ్యాలెన్స్ కోల్పోవడంతో మరోసారి బంతిని మైదానంలోకి విసిరేయగా.. పక్కనే ఉన్న ఫీల్డర్ హోస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. హండ్రెడ్ లీగ్‌ చరిత్రలోనే ఇది వేగవంతమైన సెంచరీ కావడం విశేషం

హ్యారీ బ్రూక్ సెంచరీ చేసినా.. నార్తెర్న్ సూపర్‌ చార్జర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తెర్న్ సూపర్ చార్జర్స్ నిర్ణీత 10 బంతుల్లో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ ఒక్కడే సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

అనంతరం వెల్ష్ ఫైర్ టీమ్ 90 బంతుల్లోనే 2 వికెట్లకు 159 పరుగులు చేసి గెలుపొందింది. స్టీఫెన్ ఎక్సినాజీ(58) హాఫ్ సెంచరీతో రాణించగా.. జానీ బెయిర్‌స్టో(44), జోక్లార్క్(42) విలువైన పరుగులు చేశారు.

Story first published: Wednesday, August 23, 2023, 19:31 [IST]
Other articles published on Aug 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+