Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని సలహా‌తోనే రోహిత్‌ను ఔట్ చేశాం.. మ్యాచ్ గెలిచాం: హ్యారీ బ్రూక్

తమ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇచ్చిన సలహాతోనే విజయం సాధించామని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన రోహిత్ శర్మను ఔట్ చేసేందుకు జాకోబ్ బెతెల్‌‌‌‌ను ఉపయోగించాలని మెక్‌కల్లమ్ చెప్పాడని బ్రూక్ తెలిపాడు. ఈ సలహా బాగా పనిచేసిందని, జాకోబ్ బెతెల్ అద్బుతమైన బౌలింగ్‌తో రోహిత్ శర్మను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడని చెప్పుకొచ్చాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది.

Harry Brook Credits Their Head Coach Brendon McCullum For England Victory Over India in 3rd ODI

వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌ను ఓడించాం..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హ్యారీ బ్రూక్.. తమ కోచ్ మెక్‌కల్లమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'వరల్డ్ నెంబర్ వన్ జట్టుపై సిరీస్ గెలవడం చాలా గర్వంగా ఉంది. ఈ విజయం కోసం మేం చాలా కష్టపడ్డాం. టీ20 సిరీస్ తరహాలోనే ఒకరికొకరం అండగా ఉంటూ ఆడాం.

మా బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడాం. మాకు ఒక స్పష్టమైన బ్యాటింగ్ టెంప్లేట్ ఉంది. జాకోబ్ బెతెల్, బెన్ డకెట్ అద్భుతంగా ఆడారు. 20-30 ఓవర్ల వరకు ఒక్క వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. వారి భాగస్వామ్యం మాకు భారీ లక్ష్యాన్ని అందించింది. జోరూట్ తనదైన శైలిలో చెలరేగగా..జోస బట్లర్ అదరిపోయే ముగింపును అందించాడు. ఇది మా అత్యుత్తమ ఆల్‌రౌండ్ బ్యాటింగ్ ప్రదర్శన.

మెక్‌కలమ్ సలహా పనిచేసింది..

మా ఫీల్డింగ్ సమయంలో నేను ఒక ఓవర్ పాటు బయటకు వెళ్లాను. మా కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్‌తో మాట్లాడాను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు జాకోబ్ బెతెల్‌ను ప్రయత్నించాలని మెక్‌కల్లమ్ సూచించాడు. దాంతో అతనితో వరుసగా 7-8 ఓవర్లు బౌలింగ్ చేయించాను. కానీ ఈ నిర్ణయం మాకు కీలకమైన ఘట్టంగా మారింది. రోహిత్ శర్మను బెతెల్ ఔట్ చేయడంతో మ్యాచ్‌ మావైపు మళ్లింది.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, July 20, 2026, 13:01 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+