For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌తో ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. మరే ఆటగాడు కూడా ఏ జట్టుపై ఈ ఫీట్ సాధించలేదు. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్(322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లతో 317) రికార్డ్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు.

దాంతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్థాన్ గడ్డపై అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు 4 టెస్ట్‌లు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన హ్యారీ బ్రూక్.. 130.83 యావరేజ్‌తో 785 పరుగులు చేశాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీతో పాటు నాలుగు శతకాలు ఉన్నాయి.

Harry Brook creates history becomes first player in world to test average above 100 in Pakistan

పాక్ గడ్డపై అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితాలో హ్యారీ బ్రూక్ టాప్‌లో ఉండగా.. సంజయ్ మంజ్రేకర్(94.83), వీరేంద్ర సెహ్వాగ్(91.50), సమరవీర(90.42), గ్యారీ కిర్‌స్టెన్(88.16) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్‌తో టెస్ట్‌ల్లో వరుసగా మూడు సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా హ్యారీ బ్రూక్ రికార్డ్ సాధించాడు.

అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ జాబితాలో బ్రూక్(317) 20 స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన ఆరో బ్యాటర్ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో జోరూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించారు. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కాగా.. సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఇది నాలుగోది.

2006లో సౌతాఫ్రికాపై కుమార సంగక్కర, మహేల జయవర్దనె భాగస్వామ్యం(624) నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. జో రూట్(375 బంతుల్లో 17 ఫోర్లతో 262)‌ రికార్డ్ డబుల్‌తో పాటు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీలతో చెలరేగడంతో పరుగుల వరద పారింది. ఓవర్‌నైట్ స్కోర్ 492/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 150 ఓవర్లలో 823/7 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ 49 ఓవర్లలోనే 331 పరుగులు చేయడం గమనార్హం. దాంతో ఆ జట్టుకు 267 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది. మరో నాలుగు వికెట్లు తీస్తే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించనుంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగులు చేసినా.. ఈ మ్యాచ్‌లో ఓటమి ముంగిట నిలవడం విశేషం.

Story first published: Friday, October 11, 2024, 10:14 [IST]
Other articles published on Oct 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+