సన్‌రైజర్స్ ఆటగాడి విధ్వంసం.. 15 బంతుల్లోనే ఊచకోత!
ఇంగ్లండ్ టీ20 కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ పురుషుల టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హ్యారీ బ్రూక్.. లండన్ స్పిరిట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పరుగుల విధ్వంసం సృష్టించాడు.
ది హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఆడమ్ రోసింగ్టన్ పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను హ్యారీ బ్రూక్ సమం చేశాడు. 2022, ఆగస్ట్ 14న హెడింగ్లీలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌పై లండన్ స్పిరిట్ తరఫున ఆడమ్ రోసింగ్టన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి తర్వాత నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ప్లేయర్ ఆడమ్ లిత్ రెండో స్థానంలో నిలిచాడు. అతను 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.

18 బంతుల్లో 55 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతనితో పాటు మిచెల్ మార్ష్(37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 76), ర్యాన్ రికెల్టన్(42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 100 బంతుల్లో 2 వికెట్లకు 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ది హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోర్.
అనంతరం లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 6 వికెట్లకు 204 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ విల్లే(46 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 నాటౌట్)పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఇది మూడో విజయం. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

