ఒకరిద్దరంటే కష్టం.. అందరూ ఆడాల్సిందే: హర్మన్‌ప్రీత్ కౌర్

సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సమష్టిగా చెలరేగితేనే విజయాలు సాధ్యమని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ఒకరిద్దరి మీదే ఆధారపడితే మాత్రం గెలవడం కష్టమని తెలిపింది. శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడింది.

క్లారిటీ అవసరం..
‘సమష్టి ప్రదర్శన చేయాలంటే అందరూ కలిసికట్టుగా ఆడాలి. ఒకరిద్దరి మీదే ఆధారపడితే గెలవలేమని గత టోర్నీల అనుభవం ద్వారా తెలుసుకున్నాం. ప్రపంచకప్ లాంటి పెద్దటోర్నీల్లో విజయం సాధించాలంటే ఆటగాళ్లకు స్పష్టత అవసరం. యువప్లేయర్ల రాకతో భారత జట్టులో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందో వారికింకా తెలియదు. ఆడటం వారికిష్టం. అందుకే ప్రపంచకప్‌కు ఎంపికయ్యారు. వాళ్లు కచ్చితంగా ఈ టోర్నీని ఆస్వాదిస్తారు' అని హర్మన్ చెప్పుకొచ్చింది.

మాకు ప్లస్ పాయింట్
‘మహిళా క్రికెటర్లుగా మేం ఇలాంటి సందర్భాలను ప్రేమిస్తాం. గతంలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉండేవి కావు. ఇప్పుడు వాటినీ ఆస్వాదిస్తున్నాం. సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఆతిథ్య జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు. అందరూ బాగా ఆడుతున్నారు. భారత అభిమానులు క్రికెట్‌ను ప్రేమిస్తారని తెలుసు. వాళ్లు ఎక్కడికైనా వచ్చి ఆటను వీక్షిస్తారు. అభిమానులు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తే అది మాకు సానుకూలంశం' అని హర్మన్ అభిప్రాయపడింది.

సగటు వయసు 23 ఏళ్లే..
ప్రస్తుత భారత మహిళల జట్టు సగటు వయసు 23 ఏళ్ల లోపే ఉంది. జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి యుయ ప్లేయర్ల రాకతో డ్రెస్సింగ్ రూమ్‌లో హుషారు, ఫన్ ఎక్కువైంది. ఇదే విషయాన్ని మంధాన, హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చారు.

మూడు సార్లు సెమీస్‌కు
ఇప్పటి వరకు 6 మహిళా టీ20 ప్రపంచకప్‌లు జరగ్గా.. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) టైటిల్ గెలుచుకుంది. ఇక ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2018) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మూడుసార్లు సెమీఫైనల్స్‌లోకి (2009, 2010, 2018) దూసుకెళ్లింది. అయితే టైటిల్ సమరానికి ఒక్కసారీ అర్హత పొందలేకపోయింది.
కానీ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటడమే కాకుండా కప్పుతో తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఇక ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications