అప్పటిలానే ఆస్ట్రేలియాను ఓడిస్తాం: హర్మన్‌ప్రీత్ కౌర్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2026 టోర్నీ తరహాలోనే ఆస్ట్రేలియాను మరోసారి ఓడిస్తామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. ఆసీస్‌ను ఓడిస్తే తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని చెప్పుకొచ్చింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.
ఫీల్డింగ్ మెరుగవ్వాలి..
బంగ్లాదేశ్‌తో విజయానంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ గెలుపుపై సంతోషం వ్యక్తం చేసింది. 'ఇది ఒక మంచి విజయం. మేం ఈ మ్యాచ్‌ను ఇంకాస్త ముందుగానే ముగించాల్సింది. అయినప్పటికీ 2-3 ఓవర్ల ఉండగానే విజయాన్ని అందుకోవడం చాలా మంచి విషయమే. మేం మా ఫీల్డింగ్‌పై చాలా శ్రమించాం. అయినా ఈ మ్యాచ్‌లో కొన్ని క్యాచ్‌లు చేజార్చాం.

వచ్చే మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శనను చూపిస్తామని ఆశిస్తున్నాను. క్యాచ్‌లు వదిలిన ఆటగాళ్లు మా జట్టులోనే అత్యుత్తమ ఫీల్డర్లు, కానీ కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. నిరంతరం శ్రమిస్తూ.. క్యాచ్‌లు పడుతూ ఉంటే మైదానంలో సరైన పొజిషన్లలో ఉండగలం. ఈ మ్యాచ్‌లో మేం కొన్ని తప్పులు చేశాం. కానీ తదుపరి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామని ఆశిస్తున్నాను.
ఆస్ట్రేలియాను ఓడిస్తా..
ఇక ఆస్ట్రేలియాతో తలపడడానికి మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. వారు మా అత్యుత్తమ ప్రత్యర్థుల్లో ఒకరు. ఇలాంటి టోర్నమెంట్‌లలో ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు.. మన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీయాలి. ఒకవేళ ఆస్ట్రేలియాపై మేం గెలిస్తే.. మాకు చాలా ఆత్మవిశ్వాసం వస్తుంది. గతంలో నవీ ముంబైలో సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇవ్వడమే కాకుండా, మాకున్న కొన్ని అడ్డంకులను బద్దలు కొట్టింది.'అని వన్డే ప్రపంచకప్ విజయాన్ని హర్మన్‌ప్రీత్ కౌర్ గుర్తు చేసుకుంది.
వన్డే ప్రపంచకప్ తరహా ప్రదర్శన..
గతేడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్-2లో టీమిండియా అద్వితీయమైన ప్రదర్శనతో చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విధించిన 338 పరుగుల లక్ష్యాన్ని భారత్ 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్) అజేయ శతకంతో ఈ మ్యాచ్‌లో సత్తా చాటింది. ఈ గెలుపు ఉత్సాహంతో ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మరోసారి అదే తరహా ప్రదర్శనతో తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలనే కసితో హర్మన్ సేన ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

