Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: వైజాగ్ ఫ్యాన్స్ మద్దతు అద్భుతం: హర్మన్‌ప్రీత్ కౌర్

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లారా వోల్వార్డ్ తెలిపింది.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కొంచెం మూమెంట్ లభిస్తుందని ఆశిస్తున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. లైట్స్ కింద ఇంకా మెరుగయ్యే ఛాన్స్ ఉంది. ఈ పిచ్‌పై భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. తుది జట్టులో మేం ఒక మార్పు చేశాం. క్లాస్ స్థానంలో తుమీ సెకుకునే‌ జట్టులోకి వచ్చింది. గత మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం. బ్రిట్స్ అద్భుతంగా రాణిస్తోంది.

Harmanpreet Kaur Says Supporters Have Been Great We ll Win Today vs SA

ఈ టోర్నీలో ఆమె జోరు మరింత కొనసాగాలి. ఆమె అద్భుతంగా ఆడుతోంది. మరో ఎండ్‌లో ఆమె ఆటను చూసే అవకాశం నాకు దక్కింది. భారత్‌తో మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నాం. అయితే ఎక్కువగా ఆలోచించకుండా ఒక్కో బంతితో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. ఈ రోజు ఆశించిన ఫలితం దక్కుతుందనుకుంటున్నాం.'అని సౌతాఫ్రికా కెప్టెన్ చెప్పుకొచ్చింది.

టాస్ గెలిచినా తాము బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. వైజాగ్ అభిమానుల మద్దతు అద్భుతమని చెప్పింది. 'మేం ముందుగా బ్యాటింగే చేయాలనుకున్నాం. టాస్ ఓడినా మేం కోరుకున్నదే దక్కింది. అభిమానుల నుంచి గొప్ప మద్దతు లభిస్తుంది. ప్రతీ మ్యాచ్‌కు మాకు అండగా స్టేడియానికి వస్తున్నారు. ఈ రోజు మెరుగైన ప్రదర్శన చేసి వారిని మరింత సంతోషపరుస్తామని అనుకుంటున్నాం. మా జట్టులో ఒక మార్పు చేశాం. రేణుక స్థానంలో అమన్‌జోత్‌ను తీసుకున్నాం.

ప్రతీ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. మెరుగైన ప్రదర్శన చేస్తామని భావిస్తున్నా. తొలి రెండు మ్యాచ్‌ల్లో మేం గెలవాలనుకుంటున్నాం. ఇక నుంచి మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం మా అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించాలని కోరుకుంటున్నాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.

తుది జట్లు :

భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మరిజానే కాప్, అన్నేకే బోష్, సైనలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నడిన్ డి క్లర్క్, అయబోంగా ఖాకా, తుమీ సెఖుఖునే, నోంకులేకో మ్లాబా.

Story first published: Thursday, October 9, 2025, 16:42 [IST]
Other articles published on Oct 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+