ప్రపంచకప్‌లో ఫియర్‌లెస్ గేమ్ ఆడుతాం: హర్మన్‌ప్రీత్ కౌర్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఫియర్‌లెస్ గేమ్ ఆడుతామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్ నుంచే ఫియర్‌లెస్ అప్రోచ్‌ను అనుసరిస్తామని స్పష్టం చేసింది.
దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో హర్మన్‌సేన్ టీ20 ప్రపంచకప్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఈ మెగా టోర్నీకి ముందు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒకటి గెలిచి మరొకటి ఓడింది.
అందుకే ఓడాం..
ఇంగ్లండ్‌తో వామప్ మ్యాచ్ పరాజయం అనంతరం మీడియాతో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఈ మ్యాచ్‌లు మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని తెలిపింది. 'ఈ రెండు ప్రాక్టీస్ గేమ్స్ మాకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. రిచా ఘోష్ బ్యాటింగ్ మాకు పెద్ద సానుకూల అంశం. క్రీజులో నిలబడితే ఎప్పుడైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలమనే నమ్మకం మాకు కలిగింది.
కీలకమైన భాగస్వామ్యాలను నెలకొల్పకపోవడంతోనే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాం. టీ20 క్రికెట్‌లో మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలు చాలా కీలకం. అవి మాకు దక్కలేదు. కానీ రిచా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.

తొలి మ్యాచ్ నుంచే..
మెగా టోర్నీకి ముందు జట్టులోని ప్రతీ ప్లేయర్‌కు అవకాశాలు కల్పించడంపై మా మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందరికి తగినన్ని అవకాశాలు వచ్చాయి. టోర్నీలో తొలి మ్యాచ్ నాటికే ఇక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవడం చాలా కీలకం.
తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను ఢీకొట్టబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తారనడంలో సందేహం లేదు. బర్మింగ్‌హామ్ మైదానానికి కూడా పెద్ద ఎత్తున వస్తారని భావిస్తున్నా. ప్రేక్షకుల కోలాహలంతో స్టేడియం హోరెత్తిపోతుంది. మేం కూడా మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. నిర్భయంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. దూకుడును కొనసాగించి విజయం సాధిస్తాం.’అని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.
12 జట్లు.. 33 మ్యాచ్‌లు..
పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో భారత్ గ్రూప్-ఏలో ఉంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. 2020లో ఫైనల్ చేరుకున్నప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. తాజా ఎడిషన్ అతిపెద్ద టోర్నీగా నిలవనుంది. ఇందులో తొలిసారిగా 12 జట్లు పోటీపడుతున్నాయి.
ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌తో పాటు, భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు నేరుగా అర్హత సాధించాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు క్వాలిఫయర్ల ద్వారా ఈ టోర్నీకి ఎంపికయ్యాయి. ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు ఏడు వేదికల్లో జరగనున్నాయి. జూన్ 30, జూలై 2న సెమీ-ఫైనల్స్, జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications