అందుకే జెమీమాను తప్పించాం: హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఏకైక మార్పుతో బరిలోకి దిగింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు జెమీమా రోడ్రిగ్స్‌పై వేటు వేసింది. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.
'టాస్ గెలిస్తే మేం బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. టాస్ ఓడినా మాకు అదే లభించినందుకు సంతోషంగా ఉంది. తుది జట్టులో ఒక మార్పు చేశాం. జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆమె స్థానంలో రేణుక సింగ్‌ను తీసుకున్నాం. ఎక్స్‌ట్రా బౌలర్ ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎక్స్‌ట్రా బౌలర్ ఉంటే జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇంగ్లండ్‌పై రేణుకకు అద్భుతమైన రికార్డ్ ఉంది. అందుకే ఆమెను జట్టులోకి తీసుకున్నాం.
గత మ్యాచ్‌ల్లో మేం ఓడినప్పటికీ మిడిల్ ఓవర్లలో మెరుగైన ప్రదర్శన చేశాం. అది మా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఈ మ్యాచ్ మాకు కీలకమైనది. ఆటను ఆస్వాదించి ఆశించి ఫలితాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

మరోవైపు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ తాజా పిచ్‌ను పూర్తిగా ఉపయోగించుకొని భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. ఔట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. బంతిని ఆపడానికి మేం ఫీల్డ్‌లో చాలా కష్టపడాలి.
సోఫీ ఎక్లస్టోన్, లారెన్ బెల్ రీఎంట్రీ ఇచ్చారు. వారు జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. పెద్ద భాగస్వామ్యాలు నమోదు చేయాలనుకుంటున్నాం. స్టేడియంలో భారత అభిమానులు సందడి బాగుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి సెమీస్ బెర్త్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాం.'అని నాట్ స్కివర్ చెప్పుకొచ్చింది.
తుది జట్లు:
భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఇంగ్లండ్: ఆమీ జోన్స్ (వికెట్ కీపర్), టామీ బ్యూమాంట్, హెదర్ నైట్, నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ క్యాప్సీ, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications