Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harmanpreet Kaur: హర్లీన్‌ డియోల్‌ కళ్లు చెదిరే క్యాచ్.. క్రెడిట్ అంతా అతనిదే!

Harmanpreet Kaur lauds Harleen Deol for sensational catch, gives credit to fielding Coach

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి టీ20లో భారత ప్లేయర్ హర్లీన్ డియోల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత మహిళలు ఓడినా ఈ క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ సూపర్ ఫీల్డింగ్ క్రెడిట్ అంతా ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మదేనని భారత టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. ఇటీవలి కాలంలో భారత మహిళల ఫీల్డింగ్‌ ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత మహిళా జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినా, ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు తమ ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో హర్మన్‌ ప్రీత్‌, హర్లీన్‌ డియోల్‌ రెండు అద్భుత క్యాచ్‌లు అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

సూపర్ డూపర్ క్యాచ్..

సూపర్ డూపర్ క్యాచ్..

శిఖా పాండే వేసిన ఆ ఓవర్‌లో రెండో బంతికి నాట్‌సీవర్స్‌ (55) ఆడిన షాట్‌ను.. లాంగాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హర్మన్‌ప్రీత్‌ ముందుకు డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకుంది. మరో మూడు బంతుల తర్వాత అమీజోన్స్‌ (43 ) ఆడిన భారీ షాట్‌ను లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హర్లీన్‌ డియోల్‌ అత్యద్భుతమైన రీతిలో క్యాచ్‌ అందుకుని ఔరా అనిపించింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు.

క్రెడిట్ అంతా ఫీల్డింగ్ కోచ్‌దే..

క్రెడిట్ అంతా ఫీల్డింగ్ కోచ్‌దే..

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం ఈ సూపర్ ఫీల్డింగ్‌పై స్పందించిన హర్మన్‌ ప్రీత్ ఆ క్రెడిటంతా తమ ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మకు దక్కుతుందని పేర్కొంది. 'జట్టుగా ఆడే ఆటలో ఒక స్ఫూర్తి ఉండాలి. ఈ ఆటలో మా ఫీల్డింగ్‌ చాలా బాగుంది. అనేక పరుగులను సేవ్ చేయడంతో పాటు అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసిపట్టాం. మా ఫీల్డింగ్‌ మెరుగైందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. ఇంతకుముందు కూడా మేం ఫీల్డింగ్‌లో బాగా కష్టపడే వాళ్లం. అయితే.. ఇప్పుడు ఫీల్డింగ్‌ కోచ్‌ చిన్నచిన్న మెళకువలు నేర్పించి, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాం'' అని హర్మన్‌ చెప్పుకొచ్చింది.

 మహిళల క్రికెట్‌లో ఫస్ట్ క్యాచ్ ఇదే.

మహిళల క్రికెట్‌లో ఫస్ట్ క్యాచ్ ఇదే.

బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టడం, సిక్సర్లను ఆపడం పురుషల క్రికెట్‌లో తరుచూ చూస్తుంటాం. కానీ మహిళల క్రికెట్ ఇలాంటి ఫీట్స్ చాలా అరుదు. బహుశా మహిళల క్రికెట్‌లో డియోల్ పట్టినలాంటి క్యాచ్‌ ఇదే మొదటిదనుకుంటా. అందుకనే ప్రత్యర్థి ఇంగ్లండ్‌ శిబిరం కూడా ఆమె క్యాచ్‌కు చప్పట్లు కొట్టింది. ఆనంద్‌ మహీంద్రాలాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఔరా అన్నారంటే ఆ క్యాచ్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మహిళ క్రికెటర్లు కూడా ఏ విషయంలో తక్కువ కాదని హర్లీన్ డియోల్ నిరూపించింది. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తామని చెప్పకనే చెప్పింది.

Story first published: Sunday, July 11, 2021, 16:01 [IST]
Other articles published on Jul 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+