Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్కూల్ గర్ల్ ఎర్రర్ అన్నాడా? అతను ఇంకా పిల్ల చేష్టలు మానలేదన్న మాట: హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur hits back at Nasser Hussain for ‘schoolgirl error’ comment

న్యూఢిల్లీ: స్కూల్ గర్ల్ ఎర్రర్ అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ చేసిన విమర్శలపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గట్టిగా కౌంటరిచ్చింది. ఆయన ఇంకా పిల్ల చేష్టలు మానలేదనుకుంటా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును విజయం వైపు నడిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. అనూహ్యంగా రనౌటవ్వడం భారత జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ అయిన విధానంపై నాజర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు. స్కూల్ గర్ల్ ఎర్రర్ అని మండిపడ్డాడు. బేసిక్స్ మరిచి ఏ మాత్రం పరిణితి లేకుండా రనౌటైందని విమర్శించాడు.

పిల్ల చేష్టలు..

పిల్ల చేష్టలు..

ఈ వ్యాఖ్యలను హర్మన్‌ప్రీత్ కౌర్ ముందు ప్రస్తావించగా.. గట్టిగా కౌంటరిచ్చింది. అతను అలా అన్నాడా? అయితే ఆయన ఆలోచనలు ఇంకా పరణితి చెందలేదనుకుంటా అని బదులిచ్చింది. 'అవునా, నాజర్ హుస్సెన్ అలా అన్నారా? ఆ విషయం నాకైతే తెలియదు.

ఆ మాటలు నాజర్ హుస్సేన్ ఆలోచనా విధానానికి అద్దం పడుతున్నాయి. పరుగులు చేసే క్రమంలో సింగిల్ పూర్తి చేసే సమయంలో బ్యాట్ స్ట్రక్ అయింది. ఇది దురదృష్టకరమైన ఘటన. ఇలా బ్యాట్ స్ట్రక్ అవ్వడం గతంలో తాను చాలా సార్లు చూశాను.

దురదృష్టం కొద్దీ..

దురదృష్టం కొద్దీ..

ఆ రోజు మెరుగైన ప్రదర్శన కనబర్చాం. దురదృష్టం కొద్ది అలా జరిగింది. నాజర్ హుస్సేన్ అన్నట్లు అదేమీ స్కూల్ గర్ల్ తప్పిదం కాదు. మేం పరిణతి గల ఆటగాళ్లమే. కొన్నేళ్లుగా అంతర్జాతీయ మ్యాచులు ఆడుతున్నాం. ఆయన ఆలోచన అలా ఉంటే నేను ఏమీ చేయలేను. అది స్కూల్ గర్ల్ తప్పిదం కాదని మాత్రం చెప్పగలను. మా ఫీల్డింగ్‌ కూడా పర్వాలేదు. మ్యాచ్ అన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం.

కొన్నిసార్లు బౌలింగ్, ఇంకొన్నిస్లారు బ్యాటింగ్‌లో విఫలం కావచ్చు. సమష్టిగా రాణిస్తేనే విజయాలు దక్కుతాయి. ప్రస్తుత పరిస్థితిని ఎలా అదుపులో ఉంచుకోవాలో అర్థం కావడం లేదు. ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. మేం ఓడినా మంచి క్రికెట్ ఆడామనే సంతృప్తి ఉంది.

క్రీజులో స్ట్రక్ అవ్వడంతో..

క్రీజులో స్ట్రక్ అవ్వడంతో..

వారెహమ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడి క్విక్ డబుల్‌కు ప్రయత్నించింది. ఇక సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్న గార్డ్‌నర్.. వికెట్ కీపర్‌కు వేగంగా బంతిని అందించింది. అప్పటికే హర్మన్‌ప్రీత్ క్రీజు చేరింది. కానీ బ్యాట్ స్ట్రక్ అవ్వడం.. ఆమె పాదాలు గాల్లో ఉండటం చూసిన కీపర్ హిలీ చాకచక్యంగా రనౌట్ చేసింది.

దురదృష్టవశాత్తు రనౌటవ్వడంతో హర్మన్ తన బ్యాట్‌ను నేలకు కొట్టి అసహనాన్ని ప్రదర్శించింది. అయితే పరుగు పూర్తి చేసే సమయంలో బ్యాట్‌ను క్రీజులో పెట్టేముందు చూపు అటువైపు ఉండాలనే బేసిక్ రూల్ హర్మన్ మరిచిందని పలువురు అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.

Story first published: Saturday, February 25, 2023, 11:52 [IST]
Other articles published on Feb 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+