Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్‌ప్రీత్ కౌర్ ఊచకోత.. మిథాలీ రాజ్ రికార్డ్ బ్రేక్!

భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్.. జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించింది. వడోదరలోని కోటంబి బీసీఏ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ధనాధన్ సెంచరీతో చెలరేగి భారత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకుంది.

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

101 బంతుల్లోనే సెంచరీ
జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 101 బంతుల్లోన తన 8వ వన్డే సెంచరీని పూర్తి చేసుకుంది. మొత్తం 121 బంతుల్లో ఎదుర్కొన్న ఆమె 126 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి ఔటైంది. ఈ సెంచరీతో భారత మాజీ దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ సాధించిన 7వ వన్డే సెంచరీల రికార్డును హర్మన్‌ప్రీత్ అధిగమించింది. భారత్ తరఫున మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 14 సెంచరీలతో స్మృతి మంధాన అగ్రస్థానంలో ఉండగా.. 8 సెంచరీలతో హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో స్థానానికి చేరుకోగా.. మిథాలీ రాజ్ మూడో స్థానానికి చేరింది.

Harmanpreet Kaur Hits 8th ODI Century Surpasses Mithali Raj Record vs Zimbabwe in Vadodara

తొలి వన్డేలో 91.. రెండో వన్డేలో సెంచరీ
ఈ సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ స్థిరమైన ఫామ్‌ను కనబరుస్తోంది. తొలి వన్డేలోనే అద్భుతంగా ఆడి సెంచరీకి కొద్ది దూరంలో 91 పరుగల వద్ద నిష్క్రమించింది. అయితే ఆ నిరాశను చెరిపివేస్తూ రెండో మ్యాచ్‌లో స్టేడియం నలువైపులా అద్భుతమైన షాట్లతో హోరెత్తించి సెంచరీని బాదింది. 37 ఏళ్ల వయస్సులోనూ ఆమె చూపిస్తున్న ఫిట్‌నెస్, ఆటపై ఉన్న పట్టు, నిలకడ యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని తన బ్యాటింగ్‌తో మరోసారి నిరూపించింది.

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

కెప్టెన్సీ లేకపోవడంతో పెరిగిన స్వేచ్ఛ
జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ మానసిక ఒత్తిడి తగ్గి, స్వేచ్ఛగా తన సహజసిద్ధమైన దూకుడు ఆటతీరును ప్రదర్శంచగలుగుతోంది. కెప్టెన్సీ భారం దిగిపోవడమే ఆమె ఈ స్థాయి అటాకింగ్ గేమ్ ను ఆడటానికి ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. జింబాబ్వేపై ఆడిన ఈ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికీ టీమిండియా మిడిలార్డర్ బ్యాటింగ్‌కు ప్రధాన వెన్నెముక అని స్పష్టమైంది.

Story first published: Sunday, October 25, 2026, 18:05 [IST]
Other articles published on Oct 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+