మా చేతిలో ఓడినా.. హాంకాంగ్ ఓ పాఠం నేర్పింది: హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం పసికూన హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన(64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 124) భారీ శతకంతో భారత్ 137 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారైంది.
అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా హాంకాంగ్ తమకు ఓ పాఠం నేర్పిందని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. హాంకాంగ్ సెలెబ్రేట్ చేసుకునే విధానం తమను బాగా ఆకట్టుకుందని చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను ఆస్వాదించడం ఎంత ముఖ్యమో వారి సెలెబ్రేషన్స్ చూసిన తర్వాత అర్థమైందని అభిప్రాయపడింది.

అది నా అదృష్టం
ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. స్మృతి మంధాన, దీప్తి శర్మలపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ ఇద్దరి ప్రదర్శనల పట్ల గర్వంగా ఉందని, వారికి నాయకత్వం వహించడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొంది.
'నేను మా సానుకూల అంశాలతో మొదలుపెడుతాను. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మిడిలార్డర్‌లో ఇంకా సమస్య ఉంది. అందుకే మేం ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేశాం. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడాలనుకున్నాం. పిచ్‌పై ఎక్కువ సమయం గడిపి అవగాహన పెంచుకోవాలనుకున్నాం. అయినప్పటీకీ ఒక జట్టు మేం అనుకున్న లక్ష్యాన్ని నమోదు చేయగలిగాం. ఆ తర్వాత బౌలర్లు మా కోసం తమ పనిని పూర్తి చేశారు.
మార్పులు అవసరం లేదు..
మా జట్టు కాంబినేషన్ దాదాపు సెట్ అయ్యిందనే అనుకుంటున్నా. కానీ ఏమైనా మార్పులు చేయాలా? వద్దా? అనేది తేల్చుకోవడానికి మాకు మరో రోజు సమయం ఉంది. కానీ ప్రస్తుతానికి మా కాంబినేషన్ బాగానే ఉంది. స్మృతి మంధాన, దీప్తి శర్మ ప్రదర్శన పట్ల కెప్టెన్‌గా గర్వపడుతున్నా. దేశం కోసం వారు ఆడుతున్న తీరుకు నేను కృతజ్ఞురాలిని. వారికి నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప అవకాశం. స్మృతి ఇన్నింగ్స్ చూడముచ్చటగా ఉంది. దీప్తి నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది.
అది మాకు గొప్ప పాఠం..
హాంకాంగ్ జట్టులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. వారు సంబరాలు చేసుకునే విధానం. అది మాకు గొప్ప పాఠం. కఠినమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటను ఆస్వాదించడం మర్చిపోతారు. కానీ హాంకాంగ్ ఆటగాళ్లు మైదానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఇది మాకు గొప్ప పాఠం. పరిస్థితులు ఎలా ఉన్నా.. ఆటను ఆస్వాదించడం చాలా ముఖ్యం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


