ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అనారోగ్యంతో ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ దూరమైందని హర్మన్ పేర్కొంది.
'టాస్ గెలవడం నాకు అస్సలు అలవాటు లేని పని. అయితే టాస్ గెలవకపోవడానికి కూడా నేను ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే టాస్ నా చేతుల్లో లేని పని. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. మేందు ముందుగా బౌలింగ్ చేస్తాం. అనారోగ్యంతో దీప్తి ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆమె స్థానంలో స్నేహ్ రాణా జట్టులోకి వచ్చింది. ఈ వికెట్ చూడటానికి చాలా బాగుంది.
గత మ్యాచ్ సందర్భంగా పిచ్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. మేం మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడాలనుకుంటున్నాం. గత మ్యాచ్ తరహాలోనే ఈ రోజు కూడా అదే జోరును కొనసాగించే ప్రయత్నం చేస్తాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

టాస్ ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు తెలిపింది. 'మేం సేమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. తొలి మ్యాచ్‌లో ఓడినా నా జట్టుపై నాకు నమ్మకం ఉంది. మేం కొందరు యువ ఆటగాళ్లకు అండగా నిలిచాం. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. మిడిల్ ఓవర్లలో పాజిటివ్ క్రికెట్ ఆడటమే మాకు కీలకం. గత మ్యాచ్‌లో మేం వికెట్ల వెనుకవైపు బిహైండ్ స్క్వేర్ దిశగా కొన్ని షాట్లు ఆడాం.
ఈ రోజు స్ట్రైయిట్‌గా ఆడాలనుకుంటున్నాం. లాంగాన్, లాంగాఫ్‌పై ఎక్కువ దృష్టి సారించి, మా బలానికి తగ్గట్లు భాగస్వామ్యాలను నమోదు చేయాలనుకుంటున్నాం. మా బ్యాటర్లు ఈ రోజు రాణిస్తారని ఆశిస్తున్నా.'అపి ఆటపట్టు పేర్కొంది. ఐదు టీ20ల సిరీస్‌లో వైజాగ్ వేదికగానే జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
శ్రీలంక : విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు (కెప్టెన్), హసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిష దిల్హారి, కౌషాని నుత్యంగన (వికెట్ కీపర్), మల్కి మదార, ఇనోకా రణవీర, కావ్య కావిండి, శశిని గిమ్హాని.
భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.