Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: 8 మ్యాచ్‌ల తర్వాత టాస్ గెలిచిన భారత్.. జట్టు నుంచి ఆ ముగ్గురు ఔట్!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా 8 వన్డేల తర్వాత టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచింది. ఓవర్‌కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. సెమీ ఫైనల్‌ కోసం రిచా ఘోష్‌తో పాటు క్రాంతి గౌడ్, స్నేహ్ రాణాలకు విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొంది.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఎందుకంటే ఒవర్‌కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలో ముందుగా బౌలింగ్ చేయడమే మంచి నిర్ణయమని మేం భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌తో ఉమా ఛెత్రీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తోంది. రిచా ఘోష్‌తో పాటు క్రాంతి, స్నేహ్ రాణాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించాం. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడినా.. ఆత్మస్థైర్యంతోనే గత మ్యాచ్‌లో విజయం సాధించాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

Harmanpreet Kaur Ends India Women s Eight-Match Losing Streak by Winning ODI Toss

ముందుగా బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చే అంశమేనని బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తెలిపింది. 'ముందుగా బ్యాటింగ్ చేయడం మాకు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారికి డిఫెండ్ చేసుకోవడానికి మేం ఒక మంచి లక్ష్యాన్ని ఇవ్వాలి. శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోవడం కష్టంగా ఉంది. కానీ ముందుకు సాగి అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. మా బౌలర్ల బౌలింగ్, పిచ్ కండిషన్స్ బట్టి చూస్తే.. ఈ వికెట్‌పై 230 ప్లస్ స్కోర్ సరిపోతుంది.'అని నిగర్ సుల్తానా చెప్పుకొచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఇంకా ప్రారంభం కాలేదు.

తుది జట్లు:

బంగ్లాదేశ్: సుమయ్యా అక్తర్, రుబ్యా హైదర్ జెలిక్, షర్మిన్ అక్తర్, శోభన మోస్తరీ, నిగార్ సుల్తానా(వికెట్‌కీపర్/కెప్టెన్), షోర్నా అక్తర్, రీతు మోని, రబేయా ఖాన్, నహీదా అక్తర్, నిషిత అక్తర్ నిషి, మరుఫా అక్తర్

భారత్: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, ఉమా ఛెత్రీ(వికెట్‌కీపర్), అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్

Story first published: Sunday, October 26, 2025, 16:16 [IST]
Other articles published on Oct 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+