Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup 2024: మనోడే కొంపముంచాడు!

అండర్ 19 ప్రపంచకప్‌ 2024లో అసాధారణ ప్రదర్శన‌తో ఫైనల్ చేరిన యువ భారత్.. చివరకు సీనియర్ టీమ్ మాదిరే ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాను దెబ్బకొట్టింది మన భారతీయుడే.

పంజాబ్‌కు చెందినోడు..:
ఆస్ట్రేలియా జట్టులో హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ నిలిచిన హర్జాస్ సింగ్.. భారత్ పతనాన్ని శాసించాడు. నిలకడగా బ్యాటింగ్ చేసిన అతను హాఫ్ సెంచరీతో ఆసీస్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. భారత సంతతికి చెందిన హర్జాస్ సింగ్ మూలాలు పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఉన్నాయి. హర్జాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ కాగా.. తల్లి అవిందర్ కౌర్ రాష్ట్రా స్థాయి లాంగ్ జంప్ అథ్లెట్.

Harjas Singh from Chandigarh who top scored in World Cup final against India

24 ఏళ్ల క్రితం..:
వీరి కుటుంబం 24 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలకు వలస వెళ్లింది. 2005లో సిడ్నీలో హర్జాస్ జన్మించాడు. రెవెస్బీ వర్కర్క్ క్రికెట్ క్లబ్ తరఫున 8 ఏళ్ల వయసులో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ ప్రపంచకప్ ఫైనల్ ముందు వరకు అతను గొప్పగా రాణించింది లేదు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అతని అత్యధిక స్కోర్ 17 పరుగులే. 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 49 పరుగులే చేశాడు.

ఆడింది ఫైనల్లోనే..:
కానీ కీలకమైన ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీతో భారత్ కొంపముంచాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన హర్జాస్ సింగ్.. కుడి చేతితో బౌలింగ్ చేస్తాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టాడు. హర్జాస్ సింగ్ బంధువులంతా పంజాబ్‌లోనే ఉన్నారు. చివరగా అతను 2015లో భారత్‌కు వచ్చాడు.

Harjas Singh from Chandigarh who top scored in World Cup final against India

రాజ్ లింబానీ రాణించినా..:
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హ్యూ వీబ్జెన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 48), ఓలివర్ పీక్(43 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 46 నాటౌట్), హ్యారీ డిక్సాన్(56 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో రాజ్ లింబానీ(3/38) మూడు వికెట్లు తీయగా.. నమాన్ తీవారీ(2/63), సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

హైదరాబాదోడు ఒక్కడే..:
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. లీగ్ దశలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(22), సచిన్ దాస్(9), కెప్టెన్ ఉదయ్ సహరణ్(8) దారుణంగా విఫలమయ్యారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్‌మన్(3/15), రాఫ్ మెక్‌మిలన్(3/43) మూడేసి వికెట్లు తీయగా.. కల్లమ్ విడ్లేర్(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. చార్లీ అండర్సన్, టామ్ స్ట్రేకర్ చెరో వికెట్ తీసారు.

Story first published: Monday, February 12, 2024, 11:55 [IST]
Other articles published on Feb 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+