Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెక్ జేపీఎల్ సీజన్ 2 షురూ..!

నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్(జేపీఎల్) సీజన్ 2 ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం దుండిగ‌ల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ క్రికెట్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన ఈ టోర్నీ ప్రారంభోత్స‌వానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌ రావు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ లీగ్‌లో పాల్గొంటున్న ప‌ది మీడియా జ‌ట్ల జెర్సీల‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. అనంత‌రం టాస్ వేసి తొలి మ్యాచ్‌ను ప్రారంభించడంతో పాటు సరదాగా కాసేపు బ్యాటింగ్ చేశారు.

కుత్బులాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌, మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి బౌలింగ్ చేయగా.. హరీష్ రావు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. భారీ హిట్టింగ్‌ చేస్తూ బౌండరీలు బాదారు. బ్యాటింగ్ రుచి చూసిన ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా క్రికెట్ టోర్నీ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, పోలీసులు, డాక్టర్లు వ్య‌క్తిగ‌త జీవితం కంటే వృత్తికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తార‌ని చెప్పారు. నిత్యం బిజీగా ఉండే జ‌ర్న‌లిస్టులు పని ఒత్తిడి కారణంగా చిన్నవయసులోనే అనారోగ్యానికి గురువుతున్నారని తెలిపారు. 30 ఏళ్ల బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

మనిషి ఆరోగ్యంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చున‌ని, కాబ‌ట్టి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని జ‌ర్న‌లిస్టుల‌కు సూచించారు. యోగాను దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోవాల‌ని, ప్రాణాయమం చేయాలని సలహా ఇచ్చారు. జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్(ఎస్‌జాట్)‌ను ఆయన అభినందించారు.

Harish Rao Starts NECC Journalist Primer Leauge Season 2

80 ఏళ్ల వయసులో స్విమ్మింగ్..

ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ మ‌ర్రి ల‌క్ష్మ‌ణ్ రెడ్డి గారు 80 ఏళ్ల‌ వ‌య‌సులో కూడా 21 ఏళ్ల యువ‌కుడులా ఉన్నారంటే ఫిట్‌నెస్‌కు ఆయ‌న ఇస్తున్న ప్రాధాన్య‌తే కార‌ణమ‌ని ప్ర‌శంసించారు. యువ‌త ల‌క్ష్మ‌ణ్ రెడ్డి వంటి వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించారు. ఈ వ‌య‌సులో కూడా ఆయ‌న కృష్ణాన‌దిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదుతున్నారంటే సాధార‌ణ విష‌యం కాద‌ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బులాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌, మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, శాట్ మాజీ చైర్మ‌న్ అల్లీపురం వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, టీఎస్ఎంస్ఐడీసీ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్పోర్టిఓ డైరెక్ట‌ర్ చ‌ల్లా భ‌ర‌త్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, V6 వెలుగు విజయం..

10టీవీతో ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 3 పరుగుల తేడాతో విజయం సాధించగా.. నమస్తే తెలంగాణతో జరిగిన రెండో మ్యాచ్‌లో V6 వెలుగు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఏబీఎన్ 18.3 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటవ్వగా.. 10 టీవీ 14 ఓవర్లలో 85 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది.

ఏబీఎన్ కెప్టెన్ వేమురి ఆదిత్య (4/10) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆంధ్ర జ్యోతి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వీ6 వెలుగు 102 పరుగులు ఆలౌటైంది. అనంతరం నమస్తే తెలంగాణ 94 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Monday, December 8, 2025, 10:53 [IST]
Other articles published on Dec 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+