ఆ రెండు సిక్స్‌లు విరాట్ కోహ్లీ కాకుండా ఎవరు కొట్టినా హర్ట్ అయ్యేవాడిని: హారిస్ రౌఫ్

కరాచీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ ఎంత చెప్పుకున్నా తక్కువే. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యద్బుతమైన ఇన్నింగ్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ 19వ ఓవర్ చివరి రెండు బంతులకు విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు అత్యద్భుతమైనవిగా చరిత్రకెక్కాయి.

కోహ్లీ కాకుండా..
క్రికెట్ అభిమానులే కాదు చాలా మంది మాజీ క్రికెటర్లు విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్ చరిత్రలోనే మరుపరాని ఇన్నింగ్స్ అంటూ కొనియాడారు. విరాట్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఇన్నింగ్స్ తన జీవితంలో మరిచిపోలేనిదని ట్వీట్ చేశాడు. అక్టోబర్ 23, 2022 తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని పేర్కొన్నాడు. తాజాగా ఇదే ఇన్నింగ్స్ పాకిస్థాన్ బౌలర్ హారీస్ రౌఫ్ స్పందించాడు. విరాట్ కోహ్లీ కాకుండా మరే బ్యాటర్ ఆ రెండు సిక్స్‌లు కొట్టినా బాధపడేవాడినని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఇన్నింగ్స్‌పై స్పందించిన హారీస్ రౌఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్లాస్ బ్యాటర్ కాబట్టే..
‘ఆ రెండు సిక్స్‌లు విరాట్ కాకుండా మరే ప్లేయర్ కొట్టినా నా మనసుకు బాధ కలిగేది. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా కొట్టినా నేను సహించలేకపోయేవాడిని. విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చాయి కాబట్టే ఆ ఫీలింగ్ కలగలేదు. అతను డిఫెరంట్ ప్లేయర్. కోహ్లీ తప్ప మరేవరూ కూడా నా బౌలింగ్‌లో అలాంటి షాట్లు ఆడలేరు. వరల్డ్ కప్‌లో అతను ఆడిన విధానం అద్భుతం. ప్యూర్ క్లాస్ బ్యాటింగ్. అతను ఈ రకమైన షాట్లు ఆడగలడని మాకు తెలుసు. భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో నేను తొలి 4 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాను.

స్లోయర్ బాల్‌ను కూడా..
చివరి ఓవర్ మహమ్మద్ నవాజ్‌దేనని నాకు తెలుసు. అతను స్పిన్నర్ కావడంతో అతనికి డిఫెండ్ చేయడానికి 20 పరుగులైనా ఇవ్వాలనుకున్నాను. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన పరిస్థితి. స్లోయర్‌గా వేసిన మూడు బంతులకు విరాట్ తడబడ్డాడు. ఒక బాల్ క్విక్‌గా వేస్తే బౌండరీ బాదాడు. దాంతో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ జోన్ వైపు ఆడేలా స్లోయర్ బాల్ వేయాలనేది ప్లాన్. స్క్వేర్ సైడా బౌండరీ కూడా చాలా పెద్దగా ఉంది. కానీ విరాట్ ఆఫ్ ద లెంగ్త్ వచ్చి హిట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. అతను కొట్టిన విధానం క్లాస్. నా ప్రణాళికలు సరైనదే అయినా విరాట్ తన క్లాస్ బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టాడు.'అని హరీస్ రౌఫ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications