పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ సతీమణి ముజ్ఞా మసూద్ మాలిక్‌పై భారత నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముజ్ఞా మసూద్.. భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టింది. తన భర్త హరీస్ రౌఫ్‌ను కొనియాడుతూ.. భారత్‌ను తక్కువ చేసేలా ఉన్న ఈ పోస్ట్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. రెండు సార్లు చిత్తుగా ఓడినా.. పాకిస్థాన్ క్రికెటర్లకు కావురం తగ్గలేదని భారత నెటిజన్లు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. హరీస్ రౌఫ్‌కు విరాట్ కోహ్లీ ఇచ్చిన బెల్ట్ ట్రీట్‌మెంట్ సరిపోలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్-4 పోరులో పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హరీస్ రౌఫ్ భారత అభిమానులను రెచ్చగొట్టేలా వివాదాస్పద సంజ్ఞలు చేశాడు. తన చేతులతో 6-0 అంటూ సైగ చేశాడు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు చెందిన 6 జెట్ ఫ్లైట్స్‌ను పాకిస్థాన్ నేలకూల్చిందనే ఓ అబద్దపు ప్రచారాన్ని గుర్తు చేసేలా హరీస్ రౌఫ్ 6-0 అంటూ భారత అభిమానులకు చూపించాడు. వారు కోహ్లీ కోహ్లీ అని గట్టిగా అరుస్తూ అతనికి చికాకు తెప్పించారు.

ఈ సైగలకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ముజ్ఞా మసూద్ మాలిక్.. 'మ్యాచ్ ఓడినా.. యుద్దం గెలిచాం'అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌పై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తుగా ఓడిన బాధలో అబద్దాన్ని నిజమని భ్రమపడి తమకు తాము ఓదార్చుకుంటున్నారని నెటిజన్లు కౌంటరిస్తున్నారు. కొందరైతే జుగుప్సాకరమైన రీతిలో ముజ్ఞాను తిడుతున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా భారత్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దాచిన పాకిస్థాన్.. భారత్‌కు చెందిన 6 జెట్ విమానాలను కూల్చామని అబద్దపు ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఆ జెట్ విమానాలకు సంబంధించిన వివరాలను బయటకు పెట్టలేకపోయింది. ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్.. భారత్‌ను చిత్తు చేసింది.