Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానిపై చేయి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్!(వీడియో)

పాకిస్థాన్ క్రికెటర్ హ్యారీస్ రౌఫ్.. ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అతని సతీమణి వద్దని చెబుతున్నా వినకుండా సదరు అభిమానిపై దూసుకెళ్లాడు. గొడవకు సంబంధించిన విషయంపై క్లారిటీ లేనప్పటికి హ్యారిస్ రౌఫ్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సదరు ఫ్యాన్ చేసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సదరు అభిమాని భారత్‌కు చెందినవాడని భావించి హ్యారీస్ రౌఫ్ అతనితో గొడవకు దిగినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే సదరు అభిమాని తాను పాకిస్థాన్ వాడినని చెప్పడం వీడియోలో కనిపించింది. హ్యారీస్ రౌఫ్ సతీమణితో పాటు ఇతర అభిమానులు అతన్ని ఆపిటన్లు వీడియో చూస్తే అర్థమవుతోంది.

Haris Rauf Runs To Hit Trolling Fan Thinking He Is Indian Video Goes Viral

టీ20 ప్రపంచకప్ 2024‌లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. పసికూన అమెరికా, భారత్‌ చేతిలో ఓడిన పాకిస్థాన్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించినా.. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు ఆటగాళ్లు అమెరికాలో ఉన్నారు. వారిలో హ్యారీస్ రౌఫ్ ఒకడు.

అమెరికాలో తన ఫ్యామిలీతో సేద తీరుతున్న హ్యారీస్ రౌఫ్.. సదరు అభిమాని హర్ట్ చేసేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. దాంతోనే అతను ఆగ్రహానికి గురైనట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది.

టీ20 వరల్డ్ కప్‌ 2024‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన హ్యారీస్ రౌఫ్ ఏడు వికెట్లు తీసాడు. భారత్‌పై(3/21) మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్ల వైఫల్యం పాకిస్థాన్ విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Tuesday, June 18, 2024, 15:57 [IST]
Other articles published on Jun 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+