Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik Pandya: సొంత గూటికి చేరడం సంతోషంగా ఉంది!

Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ మెగా వేలంలో నేపథ్యంలో తీవ్ర చర్చనీయాంశమైన తన క్యాష్ ట్రేడ్ డీల్‌పై హార్దిక్ పాండ్యా స్పందించాడు. సొంతగూటికి చేరడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్ మెగా వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా రూ.15 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించి తీసుకుంది.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా రెండేళ్ల పాటు జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యా.. ఒకసారి విజేతగా మరోసారి రన్నరప్‌గా జట్టును నిలబెట్టాడు. అలాంటి పాండ్యా ఉన్నట్లుండి ముంబై ఇండియన్స్‌లోకి ఎందుకు మారాడు? గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకుంది? అనేవి మిలియన్ల డాలర్ల ప్రశ్నలుగా మారాయి.

Hardik Pandya says ‘Brings back so many wonderful memories’ on homecoming to MI ahead of IPL 2024 Auction

గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకున్న తర్వాత క్యాష్ డీల్ ట్రేడ్ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇవ్వడం కూడా గందరగోళానికి తెరదీసింది. ఓవైపు హార్దిక్ పాండ్యా క్యాష్ డీల్ ట్రేడింగ్‌పై అనేక ప్రశ్నల ఉత్పన్నమవుతుండగా.. మరోవైపు హార్దిక్ పాండ్యా కూల్‌గా ట్వీట్ చేశాడు.

జట్టు మారడానికి గల కారణాన్ని మాత్రం అతను వెల్లడించలేదు. అంతేకాకుండా తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. 'ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను తిరిగి పొందనున్నాను. ముంబై, వాంఖడే, పల్టాన్ వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలు ముంబైతో ఉన్నాయి.'అని ట్విట్ చేశాడు.

ఈ పోస్ట్‌కు తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌ వేలంలో తనను ముంబై ఇండియన్స్ రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన వీడియోను జత చేశాడు. ఇందులో ముంబై ఇండియన్స్‌తో తనకు ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నాడు.

Story first published: Monday, November 27, 2023, 16:06 [IST]
Other articles published on Nov 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+