For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెమెరామెన్‌కు గాయం.. హార్దిక్ ఏం చేశాడంటే?(వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో తన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్‌కు హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పడంతో పాటు హగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అసలేం జరిగిదంటే..?

భారత ఇన్నింగ్స్ సందర్భంగా కార్బిన్ బోష్ వేసిన 13వ ఓవర్‌ రెండో బంతిని హార్దిక్ పాండ్యా మిడాఫ్ దిశగా సిక్స్ కొట్టాడు. అయితే బంతి నేరుగా వెళ్లి బౌండరీ బయట ఉన్న కెమెరామెన్ ఎడమ చేతి భుజానికి బలంగా తాకింది. ఆ సమయంలో కెమెరామెన్ భారత డగౌట్‌ దృశ్యాలను తన భుజాలపై కెమెరాపెట్టుకొని షూట్ చేస్తున్నాడు. హార్దిక్ సిక్సర్‌ను అతను గమనించకపోవడంతో బంతి అతనికి బలంగా తాకింది.

Hardik Pandya Wins Hearts With Classy Gesture After Applying Ice Pack to Cameraman Hit by His Six in Ahmedabad T20I
Photo Credit: twitter (X)

భారత ఫిజియో వచ్చి అతనికి పెయిన్ రిలీఫ్ స్ప్రే చేశాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఐస్ బ్యాగ్ పెట్టుకొని కనిపించాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెమెరామెన్ గాయంపై ఆరా తీసాడు. భారత ఫీల్డింగ్ చేయడానికి ముందు హార్దిక్ పాండ్యా.. నేరుగా కెమెరామెన్ దగ్గరకు వెళ్లి ఎలా ఉందని పలకరించాడు. అనంతరం అతన్ని హగ్ చేసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాడు. గాయమైన చోటు ఐస్ ప్యాక్ పెట్టాడు.

హార్దిక్ పాండ్యా ఊచకోత..

ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) అదిరిపోయే ఆరంభాన్ని అందించగా.. తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్, జార్జ్ లిండే తలో వికెట్ తీసారు.

అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్వింటన్ డికాక్(35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(4/53) నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా..అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా(2/17) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, December 20, 2025, 8:23 [IST]
Other articles published on Dec 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+