నాశనమైపోతావ్ రా.. హార్దిక్ పాండ్యాను తిట్టిన అభిమాని!(వీడియో)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పట్ల ఓ అభిమాని అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకు సెల్ఫీ ఇవ్వలేదని నోటికి పనిచెప్పాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు అభిమాని.. నాశనమైపోతావ్ అని శాపనార్థాలు పెట్టాడు. సదరు అభిమాని మాటలను పట్టించుకోని హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అభిమాని తిట్టినా.. హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా వెళ్లడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాధారణంగా హార్దిక్ పాండ్యా చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతుంటాడు. మైదానంలో సహచర ఆటగాళ్లు క్యాచ్ వదిలేసినా.. బంతిని ఆపకపోయినా ముందు వెనుకా చూడకుండా బండ బూతులు తిడుతాడు. అలాంటి హార్దిక్ పాండ్యా.. ఓ అభిమానిని తనను నాశనమైపోతావ్.. అని తిట్టినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అసలేం జరిగిందంటే..?
ముంబైలోని ఓ హోటల్‌కు హార్దిక్ పాండ్యా తన నయా గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి వచ్చాడు. ఆ హోటల్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తిరిగి పయనమయ్యాడు. తన కారు దగ్గరకు హార్దిక్ పాండ్యా, మహికా శర్మ రాగా.. సెల్ఫీల కోసం అభిమానులు వారిని చుట్టుముట్టారు. మహికా శర్మను కారులో కూర్చోబెట్టి వచ్చిన హార్దిక్ పాండ్యా కొందరి అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు. ఓ అభిమాని అయితే.. హార్దిక్ పాండ్యా భుజాలపై చేతులు వేసి మరి సెల్ఫీ దిగాడు.
అయినా హార్దిక్ పాండ్యా సహనం కోల్పోలేదు. అభిమానులు దూసుకొస్తుండటంతో సెక్యూరిటీ వారిని వారిస్తూ హార్దిక్‌ను కారు ఎక్కించారు. అయితే ఈ క్రమంలో తనకు సెల్ఫీ ఇవ్వలేదని ఓ అభిమాని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సహనం కోల్పోయిన సదరు అభిమాని 'నాశనమైపోతావ్'అని గట్టిగా అరిచాడు. ఈ మాటలను పట్టించుకోకుండా హార్దిక్ పాండ్యా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కోహ్లీ, బుమ్రా సైతం..
ఈ మధ్య భారత క్రికెటర్లతో అభిమానులు అతిగా ప్రవర్తిస్తున్నారు. వారి వ్యక్తిగత గోప్యత భంగం కలిగించేలా ప్రవర్తిస్తూ వారి ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల విమానాశ్రయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ జస్‌ప్రీత్ బుమ్రా వద్దని చెబుతున్నా వినకుండా ఓ అభిమాని సెల్ఫీ వీడియో తీస్తూ అతని ఆగ్రహానికి గురయ్యాడు. సదరు అభిమాని ఫోన్‌ను బుమ్రా లాగి పడేసాడు. మరో అభిమాని విరాట్ కోహ్లీ సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. అతను పట్టించుకోకుండా గుద్దుకుంటూ వెళ్లిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications