For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా.. టీమిండియా కెప్టెనా?! అంత సినిమా లేదు.. గల్లీ క్రికెట్‌కు అయితే ఓకే!!

Hardik Pandya used to captain my team in Gully Cricket: Netizens trolls captaincy debate

హైదరాబాద్: కోహ్లీసేన ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుండగా.. జులైలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. లంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కూడా ధ్రువీకరించారు. అయితే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ సైతం ఇంగ్లండ్‌లో ఉండగా.. లంకలో భారత జట్టును నడిపించేదెవరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కొత్త కెప్టెన్‌ ఎంపికపై భారత సెలెక్టర్లు కసరత్తులు చేస్తున్నారు.

అయ్యర్‌ కోలుకుంటాడా?

అయ్యర్‌ కోలుకుంటాడా?

లంక పర్యటనలో కెప్టెన్ కోసం మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్‌గా మొదటి ప్రాధాన్యం భవిష్యత్‌ సారథిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్‌ అయ్యర్‌కే. ఇప్పటికే ఐపీఎల్‌లో అతను కెప్టెన్‌గా రుజువు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్‌ 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్‌ భుజానికి తీవ్ర గాయమైంది. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ గాయం మాని మళ్లీ మైదానంలో దిగడానికి దాదాపు 3-4 నెలలు పడుతుందని వార్తలొచ్చాయి. మరి జులైలో లంక పర్యటన ఆరంభ సమయానికి అయ్యర్‌ కోలుకుంటాడా అన్నది అసలు ప్రశ్న. అయ్యర్‌ ఈ పర్యటనకు అందుబాటులో ఉంటే.. వన్డేలు, టీ20ల్లో అతనే జట్టును నడిపిస్తాడు.

హార్దిక్‌ వైపు చూడొచ్చు

హార్దిక్‌ వైపు చూడొచ్చు

ఒకవేళ శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులో లేకుంటే.. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాల్లో ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. గత ఐపీఎల్‌తో పాటు ఈ సీజన్లోనూ ధావన్‌ చక్కటి ప్రదర్శన చేశాడు. లంకకు వెళ్లే జట్టులో అతనే అత్యంత అనుభవజ్ఞుడు.

ఎనిమిదేళ్లుగా టీమిండియా స్టార్‌ ఆటగాడిగా జట్టుకు ఎన్నో విజయాలందించడమే కాక.. ఐపీఎల్‌లోనూ కొన్ని మ్యాచ్‌ల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ధావన్‌కు కలిసొచ్చేదే. భువీకి పెద్దగా అనుభవం లేదు. ఇక వర్ధమాన ఆటగాడికే బాధ్యతలు ఇవ్వాలనుకుంటే.. సెలక్టర్లు హార్దిక్‌ వైపు చూడొచ్చు. గత కొన్నేళ్లలో అతను టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు.

వారిద్దరూ విజయాలను అందించగల సమర్థులు.. సమన్వయం చేసుకుని ఆడాలి: ఓజా

పాండ్యా.. గల్లీ క్రికెట్‌కు కెప్టెన్ అయితే ఓకే

పాండ్యా.. గల్లీ క్రికెట్‌కు కెప్టెన్ అయితే ఓకే

శ్రీలంక పర్యటన కోసం కెప్టెన్సీ రేసులో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఉండటంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'అసలు హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'హార్దిక్ పాండ్యా.. టీమిండియా కెప్టెనా?' అని ఇంకొకరు అన్నారు. 'హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ అయ్యేంత సినిమా లేదు', 'పాండ్యా.. గల్లీ క్రికెట్‌కు కెప్టెన్ అయితే ఓకే', 'శిఖర్ ధావన్ కూల్.. అతనైతే కరెక్ట్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది పృథ్వీ షా, భువనేశ్వర్ కుమార్‌ని కెప్టెన్‌ని చేయాలని కామెంట్లు చేస్తున్నారు.

శ్రీలంకకు వెళ్లనున్న జట్టు ఇదే

శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియా.

Story first published: Wednesday, May 12, 2021, 11:03 [IST]
Other articles published on May 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+