Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు హార్థిక్ గుడ్ బై..మరో వివాదంలో ఆల్‌రౌండర్..!!

ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసిరావడం లేదు. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతుంటే, బయట సోషల్ మీడియాలో వివాదాలు ఆ జట్టును వెంటాడుతున్నాయి. తాజాగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టును ఇన్‌స్టాగ్రామ్‌లో 'అన్‌ఫాలో' చేశాడనే వార్త ఇప్పుడు నెట్టింట కార్చిచ్చు రేపుతోంది.

అసలేం జరిగింది?

మే 10న రాయ్‌పూర్‌ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ పరాభవం జరిగిన కాసేపటికే.. హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ముంబై ఇండియన్స్ అఫీషియల్ పేజీని అన్‌ఫాలో చేశాడంటూ స్క్రీన్ షాట్‌లు వైరల్ అయ్యాయి. అప్పటివరకు 151 మందిని ఫాలో అవుతున్న హార్దిక్ లిస్ట్‌లో ఆ సంఖ్య 150కి తగ్గడం, అందులో ముంబై ఇండియన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు.

hardik-pandya-unfollows-mumbai-indians-instagram-fans-react-after-ipl-2026-exit-sparks-controversy

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..

ఈ విషయం వైరల్ అయిన నిమిషాల వ్యవధిలోనే హార్దిక్ ఫాలోయింగ్ లిస్ట్ మళ్లీ 151కి చేరింది. ముంబై ఇండియన్స్ పేరు మళ్లీ ఆయన ఖాతాలో కనిపించింది. ఇది పొరపాటున జరిగిందా లేక కావాలనే చేసి మళ్లీ ఫాలో అయ్యాడా? అనే చర్చ మొదలైంది. అయితే హార్దిక్ చుట్టూ ఉన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ చిన్న విషయం కూడా పెద్ద వివాదంగా మారింది.

విమర్శల వెల్లువ.. విఫలమైన కెప్టెన్సీ!

రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ కట్టబెట్టినప్పటి నుంచే ముంబై ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. హార్దిక్ నాయకత్వంలో జట్టు వరుసగా రెండో ఏడాది కూడా విఫలం కావడంతో విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ సీజన్‌లో హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా దారుణంగా ఉంది.

  • బ్యాటింగ్: 8 మ్యాచ్‌ల్లో కేవలం 146 పరుగులు.
  • బౌలింగ్: కేవలం 4 వికెట్లు మాత్రమే.
  • ఫిట్‌నెస్: వెన్నునొప్పి కారణంగా కీలకమైన మ్యాచ్‌లకు దూరం కావడం జట్టును దెబ్బతీసింది. ఆయన లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాల్సి వచ్చింది.

మేనేజ్మెంట్ ఏమంటోంది?
జట్టు వైఫల్యానికి కేవలం కెప్టెన్సీ మాత్రమే కారణం కాదని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ నాయకత్వంపై తమకు ఇంకా నమ్మకం ఉందని, ఆయనకు మద్దతు కొనసాగిస్తామని అంతర్గత వర్గాల టాక్.

ఒకవైపు ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోవడం, మరోవైపు సోషల్ మీడియాలో ఈ అన్‌ఫాలో డ్రామా.. మొత్తానికి హార్దిక్ పాండ్యాకు ఈ టైమ్ అస్సలు బాలేదనిపిస్తోంది. వచ్చే సీజన్ నాటికైనా ముంబై జట్టులో సయోధ్య కుదురుతుందా? లేక హార్దిక్ మళ్లీ గుజరాత్ బాట పడతాడా? అనేది వేచి చూడాలి.

Story first published: Monday, May 11, 2026, 11:10 [IST]
Other articles published on May 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+