న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెయిర్‌స్టో మెరుపులు.. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం!!

SA vs ENG: Jonny Bairstow shines England beat South Africa

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. శుక్ర‌వారం రాత్రి కేప్‌టౌన్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో (86; 48 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. బెన్ స్టోక్స్ (37; 27 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే, లుంగి ఎన్గిడి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ 2020లో అదరగొట్టిన కగిసో రబాడ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

తొలుత ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 179 ర‌న్స్ చేసింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డూప్లెసిస్ అత్య‌ధికంగా 58 ర‌న్స్ చేశాడు. ద‌క్షిణాఫ్రికాకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ బావుమా (5) మొదటి ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ డికాక్‌కు డూప్లెసిస్ జతకలవడంతో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ గాడిలో పడింది. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచాడు. ఈ క్రమంలోనే 70 పరుగులకి పైగా భాగస్వామ్యం నెలకొల్పారు.

డికాక్‌ ఔట్ అయినా.. డూప్లెసిస్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత డూప్లెసిస్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్లాసేన్ కాస్త ధాటిగా అదే ప్రయత్నం చేశాడు. 12 బంతుల్లో 20 రన్స్ చేశాడు. చివరలో జార్జ్ లిండే ఫోర్, సిక్స్ బాదడంతో ద‌క్షిణాఫ్రికా 179 పరుగులు చేసింది. పైట్ వాన్ బిల్జోన్ నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సామ్ కర్ర‌న్ 28 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.

భారీ ల‌క్ష్యంతో చేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలుత 27 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. రాయ్ (0), బట్లర్ (7), మలన్ (19) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. అయితే ఆ ద‌శ‌లో క్రీజ్‌లోకి వ‌చ్చిన బెయిర్‌స్టో భారీ షాట్ల‌తో హోరెత్తించాడు. 48 బంతుల్లోనే అత‌ను 9 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో అజేయంగా 86 ర‌న్స్ చేశాడు. బెన్ స్టోక్స్‌తో క‌లిసి ఇద్ద‌రూ 85 ర‌న్స్ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. స్టోక్స్ 27 బంతుల్లో 37 ర‌న్స్ చేశాడు. మోర్గాన్ (12), కరన్ (7) రన్స్ చేశాడు.

రోహిత్‌ శర్మ అందుకే ఆస్ట్రేలియా వెళ్లలేదు: బీసీసీఐరోహిత్‌ శర్మ అందుకే ఆస్ట్రేలియా వెళ్లలేదు: బీసీసీఐ

Story first published: Saturday, November 28, 2020, 11:45 [IST]
Other articles published on Nov 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X