Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: చరిత్ర సృష్టించనున్న హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్!

ఐపీఎల్ 2025 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఆటగాడు సాధించిన ఈ రికార్డ్ ఈ ఇద్దరిలో ఒకరి సొంతమవ్వనుంది. కెప్టెన్లుగా ఈ ఇద్దరిలో ఎవరు టైటిల్ గెలిస్తే వారికి ఈ అరుదైన రికార్డ్‌ దక్కుతుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ గుజరాత్‌ను ఫైనల్ చేర్చిన హార్దిక్ పాండ్యా.. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించలేక తృటిలో టైటిల్ కోల్పోయాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన అతను.. రోహిత్ శర్మ వారసుడిగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. కానీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాడు. అతని సారథ్యంలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమై.. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

Hardik Pandya Shreyas Iyer Eye History In IPL 2025 With Title Win

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణం కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టును ఫైనల్ చేర్చినా విజేతగా నిలబెట్టలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కేకేఆర్‌కు వెళ్లిన అతను ఆ జట్టు సారథిగా ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను అందుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలంలోకి వచ్చిన అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతనికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత 18 సీజన్లలో పంజాబ్ కింగ్స్ 17వ కెప్టెన్‌గా అయ్యర్ గుర్తింపు పొందాడు.

హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లో ఎవరు టైటిల్ గెలిచినా.. ఐపీఎల్ చరిత్రలోనే రెండు ఫ్రాంచైజీల తరఫున టైటిల్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలవనున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది కెప్టెన్లు ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడారు. ఇందులో ఆరుగురు భారత ఆటగాళ్లు ఉండగా.. మరో మరో ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉన్నారు. కానీ ఎవరూ కూడా రెండు జట్ల తరఫున టైటిల్ ముద్దాడలేదు. ఇందులో కేకేఆర్ మాత్రమే ఇద్దరు కెప్టెన్లతో టైటిల్ గెలిచింది. గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆ జట్టు టైటిల్ అందుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిస్తే ముంబై ఇండియన్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఈ జాబితాలో చేరనున్నాయి.

ప్రస్తుతం రెండు జట్ల తరఫున ఫైనల్ ఆడిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2020 సీజన్‌లో ఫైనల్ ఆడటంతో పాటు 2024లో కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఇక టైటిల్ అందించిన కెప్టెన్‌ను వదిలేసిన ఫ్రాంచైజీగా కేకేఆర్.. జట్టు నుంచి తప్పుకున్న ఆటగాడిగా అయ్యర్ గుర్తింపు పొందారు.

Story first published: Tuesday, March 18, 2025, 23:01 [IST]
Other articles published on Mar 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+