For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేషనల్ డ్యూటీ నుంచి ఫాదర్ డ్యూటీకి హార్దిక్ పాండ్యా.. లాలి లాలి అంటూ!

Hardik Pandya Shares Adorable Pic With Son Agastya

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ఆటగాడి నుంచి తండ్రి బాధ్యతల్లోకి మారిపోయాడు. గత నాలుగు నెలల పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), ఆస్ట్రేలియా సిరీస్‌ అంటూ క్రికెట్‌లో తలమునకలై ఉన్న హార్దిక్‌ పాండ్యా శనివారం తండ్రి బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కే ఎంపికైన హార్దిక్‌ భారత్‌కు తిరిగి వచ్చేశాడు.

Hardik Pandya : I Really Didn’t Know What Misogynistic Meant

ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు. ఆ ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న పాండ్యా 'నేషనల్ డ్యూటీ నుంచి ఫాదర్ డ్యూటీ' అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్‌తో వన్డేలు, టీ20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. 'వన్డే, టీ20 సిరీస్‌ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్‌ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా' అని పాండ్యా పేర్కొన్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో 105 సగటుతో 210 పరుగులు చేసిన పాండ్యా.. టీ20 సిరీస్‌లోనూ రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.

Story first published: Sunday, December 13, 2020, 11:43 [IST]
Other articles published on Dec 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+