హార్దిక్ ఒడిలో నటాషా.. శునకంతో పాండ్యా ముద్దులాట!

ముంబై: కరోనా కారణంగా వచ్చిన విరామాన్ని భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్‌లో ఆస్వాదిస్తున్నాడు. తన ఫియాన్సీ, బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిచ్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా నటాషాతో దిగిన ఓ రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.
ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్న ఈ సూపర్ పిక్‌కు హార్దిక్ పలు ఎమోజీలను జత చేస్తూ.. లవ్‌లీ డ్రీమ్ ఫ్యామిలీ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ ఫొటో తీసిన వ్యక్తికి, తమ డిజైనర్లకు క్రెడిట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఫ్యాన్స్ కూడా సరదా కామెంట్స్ చేస్తున్నారు.
ఆ ఫొటో ఏంటంటే..?
ఈ ఫొటోలో గర్భంతో ఉన్న నటాషా.. పాండ్యా ఒడిలో వాలిపోగా.. పక్కనే ఉన్న తమ పెట్ డాగ్‌ను హార్దిక్ ముద్దించుకుంటున్నాడు. మరో రెండు శునకాలు కూడా పాండ్యా ఒడిలో వాలిపోయాయి. హార్దిక్‌తో పాటు నటాషాకు కూడా పెంపుడు శునకాలంటే మహా ఇష్టం. నటాషాతో ప్రేమ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ మాట్లాడుతూ ‘‘నేను ఎవరో అప్పటి వరకూ నటాషాకు తెలియదు. ఒక పార్టీలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను టోపీ, చైన్, వాచ్‌తో కనిపించడాన్ని చూసి.. ఈ వింత మనిషి ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చాడు..? అనుకుందట. అయితే.. నేను తనతో మాట్లాడిన తర్వాతే.. ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. ఆ వెంటనే డేటింగ్, ఎంగేజ్‌మెంట్ జరిగిపోయాయి'' అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.

పెళ్లి కాకుండానే పేరెంట్స్..
ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్ధం చేసుకున్నామని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన ఈ జోడీ.. లాక్‌డౌన్‌లో త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నామని వెల్లడించింది
అయితే ఈ జంట దండలు మార్చుకున్న ఫొటో ఒకటి వైరల్ కాగా.. వీరి పెళ్లిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే పెళ్లికాకుండానే పేరెంట్స్ అయ్యారని అందరూ భావిస్తున్నారు.
‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని హార్దిక్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

వెన్ను గాయంతో దూరమై..
గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్ పాండ్యా 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీకి సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్ కారణంగా ఆ సిరీస్ రద్దు అయింది.

దేశవాళీ టోర్నీలో వీరవిహారం..
ఇక తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో పాండ్యా రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీ డివై పాటిల్ టీ20 కప్‌లో రిలయన్స్-1 తరఫున ఆడిన హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించిన హార్దిక్.. ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అంతకుముందు కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు.
ఇక్కడ కూడా 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉండటం విశేషం. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగిన తన రీఎంట్రీ ఆరంభపు మ్యాచ్‌లో 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications