Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీ ముంబై ఇండియన్స్‌‌కు ఒక దండం: హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టుకు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే ఈ జట్టులో కొనసాగలేనని ఫ్రాంచైజీ ఓనర్స్‌కు సమాచారమిచ్చినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురికావడం, పూర్తిగా అలసిపోవడం వంటి కారణాలతో జట్టును విడిచిపెట్టడానికి హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడని పేర్కొంది.

ఐపీఎల్ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ స్థానంలో సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని తప్పుబట్టారు. ఆ కోపాన్ని హార్దిక్ పాండ్యాపై చూపించారు. ముంబై మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్ పాండ్యా గేలి చేస్తూ తీవ్రంగా అవమానించారు. ఆ సీజన్‌లో ముంబై దారుణంగా విఫలమైంది.

Hardik Pandya Set to Leave Mumbai Indians After Mentally Exhausting IPL 2026 Season

ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ అభిమానుల నుంచి నిరసన ఎదుర్కొన్న పాండ్యా.. మెరుగైన ఫలితాలనే అందించాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. తాజా సీజన్‌లో సీనియర్ల నుంచి సహకారం కొరవడటం, ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలను మాత్రమే నమోదు చేసింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దాంతోనే హార్దిక్ పాండ్యా జట్టును వీడాలనే నిర్ణయం తీసుకున్నాడని, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు చేజారిన తర్వాత.. హార్దిక్, ముంబై ఇండియన్స్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ ఫ్రాంచైజీ టాస్ సోర్స్ వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.

'హార్దిక్ పాండ్యా మానసికంగా ఒత్తిడికి గురై పూర్తిగా అలసిపోయాడు. అతనికి వెన్నునొప్పి కూడా ఉంది. నిజానికి, ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లిన తర్వాత, హార్దిక్ తాను జట్టులో కొనసాగనని ముంబై ఇండియన్స్‌కు తెలియజేశాడు. 2024లో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నప్పటి నుంచే హార్దిక్ పాండ్యా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్నాడు. ముంబై అభిమానుల నుంచే ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో కూడా అతని ప్రణాళికలు ఏవి వర్కౌట్ కాలేదు. 2021లో ముంబై ఇండియన్స్ వదిలిపెట్టిన డ్రెస్సింగ్ రూమ్‌లా ప్రస్తుతం లేదు. సీనియర్ ఆటగాళ్లంతా ఏకాభిప్రాయంతో లేరు. అది హార్దిక్ పాండ్యాకు సవాల్‌గా మారింది.

భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ జట్టు విజయాలను సాధిస్తే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దానికి భిన్నంగా ఎటువంటి ఫలితం వచ్చినా అది జట్టు కెప్టెన్‌పైనే పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో జట్టులో కొనసాగే మానసిక శక్తి ఆ ప్లేయర్‌కు ఉండదు. అందుకే వచ్చే సీజన్‌లో తాను ముంబై ఇండియన్స్ తరపున ఆడకూడదని హార్దిక్ సీజన్ మధ్యలోనే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు నాటికి అతని తదుపరి అడుగులు ఎటు పడతాయనే విషయంపై స్పష్టత రావొచ్చు.’అని ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ అధికారి అన్నాడని పీటీఐ తమ కథనంలో పేర్కొంది. ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Friday, May 29, 2026, 17:12 [IST]
Other articles published on May 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+