Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవితవ్యం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమైన నేపథ్యంలో రోజుకో వార్త తెరపైకి వస్తుంది. ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపిస్తుందని వార్తలు వచ్చాయి.

నా అటిట్యూడ్ వల్లే జట్టులో చోటు కోల్పోయా: హార్దిక్ పాండ్యా

నా అటిట్యూడ్ వల్లే జట్టులో చోటు కోల్పోయా: హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా‌కు బదులుగా ముంబై ఇండియన్స్ శివమ్ దూబే, ఆయుష్ మాత్రేలను అడిగినట్లు కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. సీఎస్‌కే మాత్రం శివమ్ దూబేతో పాటు డెవాల్డ్ బ్రెవిస్‌‌ ఇవ్వడంతో పాటు అదనంగా రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ డీల్ కొలిక్కి రాలేదని తెలుస్తోంది.

Hardik Pandya Set to Captain KKR in IPL 2027 if Blockbuster Trade Is Completed Report

తాజాగా ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. హార్దిక్ పాండ్యాను కేకేఆర్‌ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిందని, అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించబోతుందన్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. క్యాష్ డీల్ ద్వారా కొనుగోలు చేశారా?ప్లేయర్ స్వాప్ డీల్ ద్వారా తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడి అవసరం ఉంది. ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ అజింక్యా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఆ జట్టు ప్రదర్శన గాడి తప్పింది. టైటిల్ అందించిన మెంటార్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును వీడటంతో గత రెండు సీజన్లలో కేకేఆర్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచిన కేకేఆర్.. ఐపీఎల్ 2026 సీజన్‌లో 9వ స్థానంలో నిలిచింది.

IPL 2027: అతన్ని ఇచ్చి హార్దిక్‌ను తీసుకోండి.. రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై బేరం!

Also Read

IPL 2027: అతన్ని ఇచ్చి హార్దిక్‌ను తీసుకోండి.. రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై బేరం!

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వరుసగా ఆ జట్టును రెండు సార్లు ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా క్యాష్ ట్రేడ్ డీల్ ద్వారా ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై జట్టులో చేరాడు. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముంబై ఇండియన్స్ అతనికి సారథ్య బాధ్యతలు ఇచ్చింది. కానీ ఈ నిర్ణయం ముంబైకి నష్టం చేసింది. రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను కెప్టెన్ చేయడం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆటగాళ్ల నుంచి సహకారం కరువైంది. ముంబై కూడా పేలవ ప్రదర్శన కనబర్చడంతో హార్దిక్ పాండ్యాపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మానసికంగా అలసిపోయానని, జట్టులో కొనసాగలేనని హార్దిక్ పాండ్యా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

Story first published: Thursday, August 6, 2026, 16:44 [IST]
Other articles published on Aug 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+