Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌లో బిగ్ ట్విస్ట్.. ఛీ కొట్టిన ఫ్రాంచైజీ!

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ తీవ్ర చర్చనీయాంశమైంది. ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమవ్వగా.. అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యాను అడ్డుపెట్టుకొని తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఆయా ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. కేకేఆర్ కెప్టెన్సీ ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ ఇస్తే జట్టులోకి తిరిగి వస్తానని హార్దిక్ పాండ్యా షరతు పెట్టాడని, కానీ ఈ ప్రతిపాదనను ఆ జట్టు నిర్మోహమాటంగా తిరస్కరించిందని తెలిపింది.

IPL 2027 Gujarat Titans Rejected Hardik Pandya s Return After Captaincy Condition Report

గుజరాత్‌కు టైటిల్ అందించి..

ఐపీఎల్ 2022 సీజన్‌లో అరంగేట్ర చేసిన గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాతి సీజన్‌లో ఫైనల్‌కు చేర్చాడు. కానీ ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట అతను అనూహ్యంగా ట్రేడ్ ద్వారా ముంబై జట్టులోకి వచ్చాడు. ఈ నిర్ణయం అటు గుజరాత్ టైటాన్స్.. ఇటు ముంబై ఇండియన్స్‌కు చేటు చేసింది. వ్యక్తిగతంగా హార్దిక్ పాండ్యా కూడా తీవ్రంగా నష్టపోయాడు. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు.

ఈ క్రమంలోనే తిరిగి గుజరాత్ టైటాన్స్‌ జట్టులో చేరాలని హార్దిక్ భావించాడు. కానీ కెప్టెన్సీ కండిషన్ పెట్టడంతో గుజరాత్ టైటాన్స్ అతని రాకను తిరస్కరించింది. కేవలం ఆటగాడిగా వస్తానంటేనే తీసుకుంటామని స్పష్టం చేసింది.

నా అటిట్యూడ్ వల్లే జట్టులో చోటు కోల్పోయా: హార్దిక్ పాండ్యా

Also Read

నా అటిట్యూడ్ వల్లే జట్టులో చోటు కోల్పోయా: హార్దిక్ పాండ్యా

ట్రేడ్ డీల్ క్యాన్సిల్..!

'హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ సుముఖంగా ఉంది. తమ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కూడా ఫ్రాంచైజీ యాజమాన్యం చర్చించింది. హార్దిక్ పాండ్యా రాకను శుభ్‌మన్ గిల్ కూడా స్వాగతించాడు. కానీ కెప్టెన్సీ ఇవ్వాలనే కండిషన్‌కు ఒప్పుకోలేదు. దాంతో ఈ డీల్ క్యాన్సిల్ అయ్యింది.'అని గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.

అయితే ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించేందుకు గుజరాత్ టైటాన్స్ నిరాకరించిందని కూడా తమ కథనంలో రాసుకొచ్చింది. మరోవైపు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ గురించి ఏ ఫ్రాంచైజీతో చర్చలు జరగలేదని, ఒకవేళ అతన్ని ఎవరైనా సంప్రదించి ఉంటే ఆ విషయాన్ని ముంబై ఇండియన్స్‌కు తెలియజేస్తామని హార్దిక్ పాండ్యా ప్రతినిథి తెలిపారు.

Story first published: Wednesday, August 12, 2026, 10:58 [IST]
Other articles published on Aug 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+