Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mumbai Indians నా గుండెల్లో ఉంటుంది.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం!

Hardik Pandya says Will Remain In My Heart Forever After Released By Mumbai Indians

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. పాత 8 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను గత మంగళవారం ప్రకటించాయి. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా.. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ తమ కెప్టెన్ రోహిత్‌ శర్మ, వైస్ కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రాలను రిటైన్‌ చేసుకుంది. ఊహించినట్లుగానే నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న హార్దిక్ పాండ్యాను వేలంలోకి వదిలేసింది. ఇక ముంబై ఇండియన్స్ తనను వదిలేయడంపై హార్దిక్ పాండ్యా‌పై స్పందించాడు. ముంబై రిటైన్ చేసుకోకపోయినా ఆ ఫ్రాంచైజీ పేరు ఎప్పటికీ తన గుండెల్లో ఉంటుందని చెప్పాడు.

నా జీవితాంతం..

నా జీవితాంతం..

ముంబైతో తనకున్న అనుబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రూపంలో పంచుకున్నాడు. 'ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన క్షణాలను నా తర్వాతి జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటా. ఎన్నో ఆశలతో ఓ యువ ఆటగాడిగా 2015లో ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన నేను ఈరోజు అంతర్జాతీయ స్థాయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాను. ఈ ఆరేళ్లలో ముంబై ఇండియన్స్‌కు ఒక మంచి ఆల్‌రౌండర్‌గా పనిచేశాను. నాకు ముంబై ఇండియన్స్‌తో భావోద్వేగపూరితమైన బంధం ఏర్పడింది.

 నా గుండెల్లో చెరిగిపోదు..

నా గుండెల్లో చెరిగిపోదు..

జట్టులోని ఆటగాళ్లతో స్నేహం.. ముంబై ఫ్యాన్స్‌ అభిమానం.. ఇవన్నీ నాకు గొప్పగా అనిపించాయి. ఇవాళ ముంబై నన్ను వదిలేసి ఉండవచ్చు.. కానీ వారితో ఉన్న ఏమోషన్ మాత్రం ఎప్పటికి నాతోనే ఉంటుంది. ముంబై ఇండియన్స్‌లో ఇన్నాళ్లు కలిసి గెలిచాం.. కలిసి ఓడాం.. ఈ క్షణంలో దూరమవ్వడం బాధ కలిగిస్తుంది. అయినప్పటికి నా గుండెల్లో ముంబై ఇండియన్స్‌ పేరు మాత్రం ఎప్పటికి చెరిగిపోదు.'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఇక 2015లో కనీస ధర రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ జట్టులో అడుగుపెట్టిన హార్దిక్‌ పాండ్యా అనతి కాలంలో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.

స్టార్ ఆల్‌రౌండర్ ఎదిగి..

స్టార్ ఆల్‌రౌండర్ ఎదిగి..

ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. ఇక ముంబై నాలుగు ఐపీఎల్‌ టైటిళ్లు సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో ముంబై టైటిల్‌ గెలవడంలో హార్దిక్‌ పాండ్యాది కీలకపాత్ర. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం భారత జట్టులో చోటు కూడా కోల్పోయాడు.

టి20 ప్రపంచకప్‌ 2021కు ఆల్‌రౌండర్‌గా ఎంపికైనప్పటికి.. దారుణంగా విఫలమై విమర్శల పాలయ్యాడు. దీంతోపాటు బౌలింగ్‌కు దూరంగా ఉండడంతో ఆల్‌రౌండర్‌ అనే ట్యాగ్‌ హార్దిక్‌కు పనికిరాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు చురకలంటించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు హార్దిక్ సిద్దమయ్యాడు. రీహాబిటేషన్‌ కోసం ఎన్‌సీఏకు వెళ్లిన హార్దిక్‌ సౌతాఫ్రికా టూర్‌కు తనను పరిగణించొద్దంటూ సెలక్టర్లను కోరాడు.

Story first published: Friday, December 3, 2021, 17:05 [IST]
Other articles published on Dec 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+