లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మైదాన పరిస్థితులతో పాటు ఇక్కడి రికార్డులు చేజింగ్ కంటే డిఫెండింగ్‌కే అనుకూలంగా ఉన్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. దాంతోనే ముందుగా బ్యాటింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. తమ టీమ్ చేజింగ్ రికార్డు బాలేదని ఈ నిర్ణయం తీసుకోలేదని, ఈ రికార్డు పట్ల తమకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ కాస్త స్లో ట్రాక్‌గా ఉంది. మా అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని పెట్టాలనుకుంటున్నాం. మా బ్యాటర్లకు ఇదేం పరీక్ష కాదు. టాస్ గెలిస్తే లక్నో కూడా ఖచ్చితంగా బ్యాటింగ్ చేసేది. ఈ వికెట్‌పై ముందుగా బ్యాటింగ్ చేయడమే మంచిది. మా చేజింగ్ రికార్డు పట్ల మాకు ఎలాంటి ఆందోళన లేదు. అల్జారీ జోసెఫ్ స్థానంలో నూర్ అహ్మద్‌ను తీసుకున్నాం.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. అయితే ఈ సవాల్‌కు తాము సిద్దంగా ఉన్నామని చెప్పాడు. 'ఇదే వికెట్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయం సాధించాం. తక్కువ స్కోర్‌కే పరిమితం చేసి సునాయసంగా చేధించాం. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నాం. 12-13 మంది ఆటగాళ్లపై నమ్మకం ఉంచాం. కొందరు గాయాలతో బాధపడినప్పుడల్లా ఇతరులు సత్తా చాటుతున్నారు. సమష్టిగా రాణించి విజయాలు అందుకోవాలనుకుంటున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా మంచి జోష్ ఉంది.'అని రాహుల్ తెలిపాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్