Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: వారి వల్లే ఈ ఓటమి: హార్దిక్ పాండ్యా

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్‌ తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. బౌలింగ్‌లో 15-20 పరుగులు అదనంగా ఇవ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. గుజరాత్ ఓపెనర్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు.

'బ్యాటింగ్, బౌలింగ్‌లో 15-20 పరుగులు తక్కువ చేశాం. మైదానంలో ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదు. ఫీల్డింగ్‌లో బేసిక్ తప్పిదాలు చేయడంతో 20-25 పరుగులు అదనంగా ఇచ్చాం. టీ20 గేమ్‌లో ఇవి చాలా ఎక్కువ. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఎలాంటి రిస్కీ షాట్స్ ఆడకుండా తెలివిగా పరుగులు రాబట్టారు. మేం మెరుగ్గా రాణించే ప్రయత్నం చేశాం. కానీ విజయాన్ని అందుకోలేకపోయాం.

Hardik Pandya says we made basic errors and that cost us after GT beat MI in IPL 2025

ఈ ఓటమికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. టోర్నీ ఆరంభం దశలోనే ఉన్నాం. బ్యాటర్లు రాణించాలి. త్వరలోనే వారు ఫామ్ అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ వికెట్‌పై స్లోయర్ బాల్స్ కఠినంగా మారాయి. కొన్ని బౌన్స్ అయితే మరికొన్ని వికెట్ టు వికెట్ వచ్చాయి. ఆ బంతులను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టమైంది. నా బౌలింగ్‌లో నేను ఏదైతే చేశానో.. గుజరాత్ బౌలర్లు అదే చేశారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), జోస్ బట్లర్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/29) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మా న్, సత్యనారాయణ రాజు తలో వికెట్ తీసారు.

అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 48), తిలక్ వర్మ(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39)మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, సాయి కిషోర్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, March 30, 2025, 0:20 [IST]
Other articles published on Mar 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+