Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం!

బ్యాటింగ్ వైఫల్యంతోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం స్పందించిన హార్దిక్ పాండ్యా.. భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడం తమ విజయవకాశాలు దెబ్బతీసిందన్నాడు. 'బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యాం. భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడంతో పాటు వరుసగా వికెట్లు కోల్పోయాం. టీ20 క్రికెట్‌లో పార్ట్‌నర్‌షిప్స్ రాకుంటే గెలవడం కష్టం.

Hardik Pandya Reaction

చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ వాటికి తర్వాత సమాధానం చెబుతా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేను. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత వికెట్‌ మరింత మెరుగైంది. డ్యూ వచ్చింది. మా తప్పిదాలపై విశ్లేషించుకుంటాం. మరింత మెరుగ్గా తిరిగి వస్తాం.
ప్రతికూల ఫలితాలు ఎదురైనా పోరాడుతూనే ఉండాలని నాకు నేను చెప్పుకుంటా. పోరాటాన్ని విడిచిపెట్టి పారిపోవద్దు. కఠినమైన రోజులు గడపవచ్చు. కానీ మంచి రోజులు కూడా వస్తాయి. ఈ ఓటములు సవాల్‌గా ఉంటాయి. కానీ ఈ సవాళ్లే మిమ్మల్ని మెరుగుపరుస్తాయి.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/33) నాలుగు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో రెండు వికెట్లు తీసారు.

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. ఇది ముంబై ఇండియన్స్ 8వ పరాజయం. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి.

Story first published: Saturday, May 4, 2024, 0:06 [IST]
Other articles published on May 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+