Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలా ధాటిగా ఆడి భారీ స్కోర్ నమోదు చేస్తుందని తాను అస్సలు ఊహించలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు ఇంతలా అనుకూలిస్తుందని కూడా పసిగట్టలేకపోయామని చెప్పాడు. ముందే ఊహించి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు. ఈ పరాజయంలో ఎవరి తప్పులేదని, తమ ఆటగాళ్లందరూ అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. బౌలింగ్‌లో కాస్త విభిన్నమైన ప్రణాళికలు అనుసరించాల్సిందని అభిప్రాయపడ్డాడు. తమ కంటే సన్‌రైజర్స్ అద్భుతంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసిందని కొనియాడాడు.

Hardik Pandya says

'సన్‌రైజర్స్ హైదరాబాద్ 277 పరుగుల రికార్డు స్కోర్ చేస్తుందని టాస్ సమయంలో ఊహించలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బౌలర్ల తప్పు ఏ మాత్రం లేదు. ప్రత్యర్థి 277 పరుగులు చేసిందంటే ఆ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని అర్థం. బౌలింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్‌పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

ఇరు జట్లు 500 ప్లస్ రన్స్ చేశాయంటేనే పిచ్ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్‌లో మేం కాస్త విభిన్నంగా ప్రయత్నించాల్సింది. కానీ మాది యంగ్ బౌలింగ్ అటాక్. మా బౌలర్లు ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది. ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం.

బ్యాటింగ్‌లోనూ తిలక్ వర్మ, రోహిత్, ఇషాన్ కిషన్, టీమ్ డేవిడ్ అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశారు. మఫకా యంగ్ బౌలర్. తొలి మ్యాచ్‌లో కిక్కిరిసిన మైదానంలో అతను కాస్త కంగారుపడ్డాడు. దాంతో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అతను మళ్లీ నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటాడు. అతనికి అపారమైన నైపుణ్యం ఉంది. అతనికి కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో చేసి పోరాటం వృథా అయ్యింది. క్రీజులో సెట్ అయిన తిలక్ వర్మను ఔట్ చేసి కమిన్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

Story first published: Thursday, March 28, 2024, 0:44 [IST]
Other articles published on Mar 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+