For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ నిర్ణయమే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా

తరౌబా: ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం తమ ఓటమిని శాసించిందని టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ పరాజయంపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. వరుసగా వికెట్లు కోల్పోవడం, పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు టీమ్ కాంబినేషన్ లేకపోవడం ఓటమికి కారణమయ్యాయని తెలిపాడు.

Hardik Pandya says three spinners combination strategy backfired

'లక్ష్యాన్ని సునాయసంగా చేధించేలా బ్యాటింగ్ చేశాం. చాలా సౌకర్యవంతంగా కనిపించాం. కానీ మేం చేసిన కొన్ని తప్పులు మా ఓటమిని శాసించాయి. యువ జట్టుగా తప్పులు చేయడం సహజమే. ఈ తప్పుల నుంచి సమష్టిగా పాఠాలు నేర్చుకుంటాం. మ్యాచ్ ఆసాంతం.. గేమ్ మా ఆధీనంలో ఉంది. ఈ మ్యాచ్‌లో మాకు లభించిన సానుకూలంశం ఇదే.

ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం. టీ20 క్రికెట్‌లో వరుసగా వికెట్లు కోల్పోతే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించడం చాలా కష్టం. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది.

రెండు మూడు భారీ షాట్లు మూమెంటమ్‌ను మావైపు తిప్పేవి. కానీ మేం వరుసగా వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం కూడా మాకు నష్టం చేసింది.

పరిస్థితులతో సంబంధం లేకుండా మేం టీమ్ కాంబినేషన్‌ను ఎంపిక చేశాం. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ కాంబినేషన్‌ను మళ్లీ బరిలోకి దించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యాటింగ్ డెప్త్ కోసం అక్షర్ పటేల్‌ను తీసుకున్నాం. ఇదే సరైన కాంబినేషన్ అని భావించాం. కానీ మా ప్రయత్నం బెడిసికొట్టింది.

ముకేశ్ కుమార్ తన అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. జట్టు విజయం కోసం తన వంతు కృషి చేశాడు. తిలక్ వర్మ సైతం తన అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టాడు. అద్భుతంగా తన కెరీర్‌ను ప్రారంభించాడు.

ఫియర్‌లెస్ గేమ్‌తో భారీ సిక్స్‌లు బాదాడు. భారత్ తరఫున అతను మరిన్ని అద్భుతాలు చేస్తాడు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(41), రోవ్‌మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, August 4, 2023, 7:59 [IST]
Other articles published on Aug 4, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+