Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే విజయ్ శంకర్‌ను పక్కనపెట్టాం: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says the last game was a precautionary absence, Vijay Shankar goes out and I come in

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని, విజయ్ శంకర్ స్థానంలో తాను బరిలోకి దిగుతున్నానని చెప్పాడు.

ముందస్తు చర్యల్లో భాగంగానే తాను గత మ్యాచ్ ఆడలేదని చెప్పిన హార్దిక్.. ఐదు రోజుల విశ్రాంతితో గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని తెలిపాడు. బ్యాటింగ్‌లో దుమ్మురేపాలనుకుంటున్నామని, అయితే వికెట్ ఎలా స్పందిస్తుందో చూడాలని చెప్పాడు. తాను జట్టులోకి రావడంతోనే విజయ్ శంకర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. ఇక కాలి కండరాలు పట్టేయడంతో హార్దిక్ పాండ్యా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

టాస్ ఓడిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం ముందుగా బ్యాటింగే తీసుకునేవాడినని చెప్పాడు. ఢిల్లీతో ఇక్కడ ఆడిన గత మ్యాచ్‌లో ముందుగా ఫీల్డింగ్ చేయడం కష్టంగా అనిపించిందన్నాడు. వికెట్ సైతం బ్యాటింగ్ అనుకూలించిందని చెప్పాడు. అయితే తమ జట్టులో ఎవరూ కూడా నిరాశగా లేరని, తామేం చెత్తగా ఆడి ఓడిపోలేదన్నాడు. ఇదే ఉత్సాహాన్ని ముందుకు కొనసాగిస్తూ విజయాలు అందుకుంటున్నామని చెప్పాడు. గాయాల కారణంగా తమ జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. టీమ్ సౌథీ, సామ్ బిల్లింగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చారని చెప్పాడు.

గుజరాత్ టైటాన్స్ ఈసీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. మంచి విజయాలను అందుకుంటుంది. చెన్నైతో జరిగిన చివరి మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించడంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 2స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్ ధీటుగా పోరాడినా చివరికి ఓడిపోయింది.

తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్ : వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, టీమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్

Story first published: Saturday, April 23, 2022, 15:31 [IST]
Other articles published on Apr 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+