Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్ ప్రమాదం దురదృష్టకరం.. ఈ ఏడాది టీమిండియా తీర్మానం అదే: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says The biggest new year resolution is to win the World Cup

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం దురదృష్టకరమని తాత్కలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో కీలకమైన పంత్ ఇలా జట్టుకు దూరమవుతాడని అస్సలు ఊహించలేదన్నాడు. అతను త్వరగా కోలుకోవాలని జట్టు మొత్తం కోరుకుంటుందన్నాడు. భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదని, అతని గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అవకాశాలు అందుకుంటారని తెలిపాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లకు రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. మంగళవారం వాంఖడే వేదికగా జరిగే తొలి టీ20 నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. వన్డే ప్రపంచకప్ గెలవడమే ఈ ఏడాది టీమిండియా ముందున్న లక్ష్యమని చెప్పాడు.

పంత్ ప్రమాదం దురదృష్టకరం..

పంత్ ప్రమాదం దురదృష్టకరం..

'రిషభ్ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం దురదృష్టకరం. ఇలాంటి ఊహించని ఘటనలు ఎవరీ ఆధినంలో ఉండవు. ఓ జట్టుగా అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను కీలక సభ్యుడు. కానీ ప్రస్తుత పరిస్థితి అందరికి తెలిసిందే. అతని గైర్హాజరీలో చాలా మంది కుర్రాళ్లు అవకాశాలు అందుకుంటారు. రిషభ్ పంత్ ఉండి ఉంటే అతను అత్యంత ప్రభావం చూపేవాడు. అయితే భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదు. కాలమే నిర్ణయిస్తుంది. వన్డే ప్రపంచకప్ గెలవడమే ఈ ఏడాది టీమిండియా అతిపెద్ద తీర్మానం'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

నిద్రమత్తులో ..

నిద్రమత్తులో ..

డిసెంబర్‌ 30న ఢిల్లీ- డెహ్రాడూన్‌ జాతీయ రహదారిపై పంత్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. న్యూఇయర్‌కు తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి ఒక్కడే స్వయంగా డ్రైవ్ చేస్తూ రూర్కీ బయలు దేరిన పంత్.. నిద్రమత్తులో డివైడర్ రేలింగ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో అతని కారు పూర్తిగా దగ్దమవ్వగా.. ఓ బస్సు డ్రైవర్ సాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌కు నుదిటిపై రెండు కాట్లు పడటంతో పాటు మొకాలి లింగ్‌మెంట్‌లో ఫ్రాక్టర్, మడమ, బొటన వేలికి గాయాలయ్యాయి. వీపు భాగంలో కూడా గాయాలయ్యాయి. దాంతో అతను సుమారు 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి.

జనరల్ వార్డుకు షిఫ్ట్..

అదే జరిగితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌తో పాటు ఐపీఎల్‌కు పంత్ దూరం కానున్నాడు. ప్రస్తుతం పంత్ కోలుకున్నట్లు తెలుస్తోంది. అతన్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డ్‌కు షిఫ్ట్ చేసినట్లు ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ వెల్లడించాడు. 'పంత్‌ ఆరోగ్యం మెరుగవుతోంది. ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిన్న సాయంత్రం అతన్ని ప్రైవేట్ వార్డుకు మార్చారు. మరింత కోలుకునే వరకు డెహ్రాడూన్‌ అసుపత్రిలోనే చికిత్స ఉంటుంది. ఇప్పటికే నుదుటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్‌ సర్జరీని వైద్యులు చేశారు. కాలి లెగ్మెంట్‌ చికిత్స కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది'అని తెలిపాడు.

శ్రీలకంతో తొలి టీ20..

శ్రీలకంతో తొలి టీ20..

ముంబైలోని వాంఖడే వేదికగా మంగళవారం తొలి టీ20 జరగనుండగా.. ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. సోమవారమే టీమిండియా ఆటగాళ్లంతా ముంబైకి రాగా.. మంగళవారం జోరుగా ప్రాక్టీస్ చేశారు. యువ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ నెట్స్‌లో చెమటోడ్చారు. అనంతరం కొత్త స్పాన్సర్ ఎంపీఎల్ జెర్సీ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.

Story first published: Monday, January 2, 2023, 19:00 [IST]
Other articles published on Jan 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+