Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం గొప్ప విషయం కాదు.. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందంతే: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says Nothing special, feels like an ordinary day in life after heroics in 1st T20I

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల భారీ విజయాన్నందుకుంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(51, 4/33) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ఇదేం గొప్ప విషయం కాదన్నాడు. ఇది తనకేం ప్రత్యేకం కాదని, ఓ సాధారణ ప్రదర్శనేనని తెలిపాడు. కాకపోతే తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నానని చెప్పాడు. విజయానంతరం యువ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ ఇషన్ కిషన్‌తో కలిసి బీసీసీఐ టీవీతో మాట్లాడిన హార్దిక్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు. జీవితంలో ఎప్పటిలానే ఇది కూడా ఓ సాధారణమైన రోజు. కాకపోతే నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. దీనికి మాత్రమే నేను సంతోషపడుతున్నా. నేను బంతిని 90.5 కిలోమీటర్ల వేగంతో వేయడానికి గల కారణంగా సపోర్ట్ స్టాఫ్. ముఖ్యంగా షోహమ్ దేశాయ్, హర్షా. ఈ ఇద్దరూ ఇంగ్లండ్‌తో సిరీస్ నుంచి నాతో కలిసి హార్డ్ వర్క్ చేసారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవైపు వికెట్లు పోతున్నా.. బ్యాటర్ల జోరు కొనసాగింది. అందరూ సానుకూలదృక్పథంతో బ్యాటింగ్ చేసారు. ఇది టీమిండియాకు శుభపరిణామం. నేను రిస్కీ-ఫ్రీ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాను. ఐపీఎల్‌లో టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడం వల్ల బౌండరీలు కొట్టడం నేర్చుకున్నాను. నేను ఇప్పటికే జీవితానికి సరిపోయినన్ని సిక్సర్లు కొట్టాను. ఇప్పుడు బౌండరీ‌లు బాదడం సంతృప్తినిస్తోంది.

గతంలో నేను ఇంగ్లండ్‌లో టీ20 మ్యాచ్‌ ఆడినప్పుడు నాలుగు వికెట్లు తీసి సుమారు 30 పరుగులు చేశానని గుర్తు. ఇప్పుడు 4 వికెట్లతో పాటు అర్ధశతకం సాధించడంతో.. ఈ ఘతన సాధించిన తొలి భారత ఆటగాడినని అనుకుంటున్నా. ఇలా రాణించడంతో ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నా. మ్యాచ్‌ ఆడే ముందు నా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు చాలా సమయం పడుతుంది. అయితే, ఇలా రాణించడానికి ముందు తీసుకున్న విరామాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. అందుకోసమే గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరామం తీసుకున్నా. దీంతో తిరిగి గాడిలో పడేందుకు ఎంతో కష్టపడ్డా. అలా నన్ను నేను మెరుగుపర్చుకోకపోతే ఆడటంలో అర్థం లేదని భావించా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇలా తిరిగి పుంజుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని హార్దిక్‌ పాండ్య పేర్కొన్నాడు.

Story first published: Friday, July 8, 2022, 16:43 [IST]
Other articles published on Jul 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+