Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్, ధోనీ కాదు.. నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says My Favourite Cricketer Was Actually Wasim Jaffer

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుతమైన నాయకత్వంతో పాటు వ్యక్తిగతంగా దుమ్మురేపిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గుజరాత్‌ను చాంపియన్‌గా నిలిపి తిట్టిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా తన కెరీర్‌కు సక్సెస్ కారణం మహేంద్ర సింగ్ ధోనీనే అని చెప్పిన విషయం తెలిసిందే.

కెరీర్ ఆరంభంలో మహీ అండగా నిలవకపోవతే తాను ఇక్కడిదాక వచ్చే వాడిని కాదని, ధోనీ సారథ్యంలో ఆడటం తాను చేసుకున్న అదృష్టమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఫేవరేట్ క్రికెటర్ ఎవరంటే సహజంగా ధోనీ పేరే చెబుతారు.

వసీం జాఫర్ ఫేవరేట్ అంటూ..

వసీం జాఫర్ ఫేవరేట్ అంటూ..

సాధారణంగా చాలామంది ఆటగాళ్లు తమ ఫేవరెట్ క్రికెటర్లుగా సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సెహ్వాగ్‌, సౌరభ్ గంగూలీ, బ్రియాన్‌ లారా, షేన్‌ వార్న్‌, కలిస్‌, సంగక్కర లాంటి దిగ్గజ ఆటగాళ్ల పేరు చెబుతారు. కానీ, హార్ధిక్‌ పాండ్యా మాత్రం తన ఫేవరెట్‌ క్రికెటర్‌ భారత మాజీ ఓపెనర్‌, దేశవాళీ క్రికెట్‌ దిగ్గజం వసీం జాఫర్‌ అని చెప్పుకొచ్చాడు. అలాగే, తన సోదరుడు కృనాల్ పాండ్యతో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా హార్దిక్‌ వివరించాడు.

జాఫర్ బ్యాటింగ్ కాపీ కొట్టా..

జాఫర్ బ్యాటింగ్ కాపీ కొట్టా..

'నాకు జాక్వెస్ కలిస్‌, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. నిజానికి నా అభిమాన క్రికెటర్ వసీం జాఫర్. అతను బ్యాటింగ్‌ చేస్తుంటే చూడటం నాకు చాలా ఇష్టం. ఏదో విధంగా నేను వసీం జాఫర్‌ బ్యాటింగ్‌ను కాపీ కొట్టాను. కానీ అతని క్లాస్‌ను ఎప్పుడూ అందుకోలేకపోయాను.

నేను కృనాల్‌ పాండ్యా క్రికెట్, జీవితంతోపాటు చాలా విషయాలు మాట్లాడుకుంటాము. టీమిండియాకు ఆడాలని మేం ఇద్దరం ఆరేళ్ల ముందే అనుకున్నాం. కృనాల్, నేను పూర్తిగా భిన్నమైన క్రికెటర్లం. మా మధ్య ఎప్పుడూ పోటీ లేదు. ఎందుకంటే మా పాత్రలు భిన్నంగా ఉంటాయి' అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

దేశవాళీ దిగ్గజం

దేశవాళీ దిగ్గజం

వసీం జాఫర్‌ 2000-2008 మధ్య టీమిండియా తరఫున 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశాడు. అప్పటికే భారత జట్టులో సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ వంటి దిగ్గజాలు ఉండటంతో జాఫర్ కు జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా తనకు వచ్చిన అవకాశాలను జాఫర్ సద్వినియోగం చేసుకున్నాడు.

తాను ఆడిన 31 టెస్టులలో 11 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 212 గా ఉంది. జాతీయ జట్టులో జాఫర్ కు అంతగా గుర్తింపు దక్కకపోయినా దేశవాళీలో మాత్రం జాఫర్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. 260 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ఏకంగా 19,410 పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలున్నాయి. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఘనత సాధించాడు.

Story first published: Wednesday, June 8, 2022, 8:40 [IST]
Other articles published on Jun 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+