Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యో-యో టెస్ట్‌లో నాదే బెస్ట్ స్కోర్: హార్దిక్ పాండ్యా

యో-యో టెస్ట్‌లో తనదే బెస్ట్ స్కోర్ అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. క్రికెటర్ల ఫిట్‌నెస్‌‌ను పరీక్షించేందుకు యో-యో టెస్ట్‌ను నిర్వహిస్తారు. గత ఏడేళ్లుగా భారత జట్టు కూడా ఈ పద్దతిని అనుసరిస్తోంది. భారత జట్టులో కొనసాగాలంటే ప్రతీ ఆటగాడు ఈ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఈ పద్దతిని ప్రవేశపెట్టారు.

జట్టులోని ఎంత పెద్ద ఆటగాడైనా.. ఈ పరీక్షను నెగ్గాల్సిందే. తాజాగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి సెలెక్టర్లు తప్పించిన విషయం తెలిసిందే. అతని ఫిట్‌నెస్‌పై ఉన్న సందేహాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సెలెక్టర్లు స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా తమకు కీలక ఆటగాడని, కెప్టెన్సీ బాధ్యతలతో అతనిపై అదనపు బాధ్యతలు ఉంచాలనుకోవడం లేదని తెలిపారు.

Hardik Pandya says My best Yo-Yo Test score is 21 7 after Captaincy Snub

టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్టర్లు నియమించారు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌తో సూర్య కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని, 2026 టీ20 వరల్డ్ కప్ వరకు అతనే సారథిగా కొనసాగుతాడని తెలిపారు.

హార్దిక్ పాండ్య కీలకమైన ప్లేయర్. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. కానీ ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్ కావాలి. అందుకే సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాం. అర్హులైన వాళ్లలో అతను ఒక్కరు. టీ20 అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకరు'' అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.

అయితే హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అతను వన్డే ప్రపంచకప్ సమయంలో మళ్లీ గాయపడ్డాడు. మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024తో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనే తదుపరి టీ20 కెప్టెన్ అని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అనూహ్యంగా సూర్యను ఎంపిక చేశారు.

ఓవైపు కెప్టెన్సీ కోల్పోయిన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తన సతీమణి నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడు. ఈ రెండు ఘటనల తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా.. ఈ కష్టాలు తనకు కొత్త కావని తెలిపాడు. 16 ఏళ్ల వయసు నుంచే ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పాడు.

ఏ విషయంలోనైనా నెంబర్ వన్‌గా ఉండటం తనకు ఇష్టమని, దాని కోసం తీవ్రంగా కష్టపడుతానని తెలిపాడు. ఫిట్‌నెస్‌పై తనకు పెద్దగా అవగాహన ఉండేది కాదని, కానీ శారీరకంగా తాను చాలా బలవంతుడినని తెలిపాడు. చిన్నప్పటి నుంచే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నానని చెప్పాడు. తన యో యో బెస్ట్ స్కోర్ 21.7 అని పేర్కొన్నాడు.

Story first published: Monday, July 22, 2024, 18:30 [IST]
Other articles published on Jul 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+