Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs MI: అందుకే ఓడాం: హార్దిక్ పాండ్యా

ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్ గేమ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయామని తెలిపాడు. నెహాల్ వధేరా అసాధారణ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించినా.. తమ విజయానికి సరిపోలేదని చెప్పాడు.

Hardik Pandya says losing early wickets cost us after LSG beat MI in IPL 2024

'ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఇలా వరుసగా వికెట్లు కోల్పోతే పుంజుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం. మేం కూడా ఈ మ్యాచ్‌లో రికవరీ కాలేకపోయాం. బంతిని చూసి హిట్ చేయాలి. కానీ మేం మిస్ చేసుకున్న బాల్స్ మమ్మల్ని ఔట్ చేశాయి. ఈ సీజన్‌ మొత్తం మాకు ఇలానే జరిగింది. మేం పుంజుకుంటామని నేను ఎప్పుడూ నమ్ముతాను. కమ్ బ్యాక్ చేయాలంటే సాయశక్తులా పోరాడాలి.

ఈ గేమ్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ మ్యాచ్‌ అద్భుతంగా జరిగింది. వధేరా గతేడాది కూడా ఇలానే ఆడాడు. అయితే ఈ టోర్నీ ఆరంభంలో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ భవిష్యత్తులో అతను చాలా ఐపీఎల్ ఆడటంతో పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తాడు.'అని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. నెహాల్ వధేరా(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), ఇషాన్ కిషన్(36 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్(2/36) రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య ఛేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినీస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, నువాన్ తుషారా తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, April 30, 2024, 23:53 [IST]
Other articles published on Apr 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+